ఈ ఏడాదిలో రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

| Edited By:

Aug 17, 2020 | 5:11 PM

ఈ ఏడాదిలో రెండు సార్లు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు జరగనుండగా..

ఈ ఏడాదిలో రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Follow us on

Srivari Brahmotsavam 2020: ఈ ఏడాదిలో రెండు సార్లు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. అక్టోబర్ 16 నుంచి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధిక మాసం రావడంతో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాహనసేవలను ఏకాంతంగా నిర్వహించాలా లేదా యథావిధిగా నిర్వహించాలా అనే అంశంపై ఈ నెలాఖరును జరిగే బోర్డు సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. అలాగే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా బ్రహ్మోత్సవాలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల కోసం సెప్టెంబర్‌ 18న అంకురార్పణ మొదలు కానుంది. ఇక 19 ధ్వజారోహణం, 23న శ్రీవారి గరుడ సేవ, 24న స్వర్ణ రథోత్సవం, 27న చక్రస్నానం, ధ్వజావరోహణం జరగనున్నాయి.

Read More:

మాధవన్‌ని ‘కిస్’‌ చేయాలంటే చిన్నపాటి గుండెపోటు వచ్చింది

భారీ వర్షాలు.. ఊడుతోన్న విమానాశ్రయ పైకప్పు