కళ్లజోడుతో శ్రీకాళహస్తి ఆలయంలోకి ఎంట్రీ.. అర్చకుడి అనుమానంతో అడ్డంగా బుక్కైన భక్తుడు!

తిరుపతి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి సీక్రెట్ కెమెరా ఉన్న కళ్లజోడుతో అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిన ఓ భక్తుడి వ్యవహారం కలకలం రేపింది. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా వీడియో తీసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన అర్చకుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. దీంతో ఆ భక్తుడి బాగోతం బయటపడింది.

కళ్లజోడుతో శ్రీకాళహస్తి ఆలయంలోకి ఎంట్రీ.. అర్చకుడి అనుమానంతో అడ్డంగా బుక్కైన భక్తుడు!
Secret Camera Glasses

Edited By:

Updated on: Nov 14, 2026 | 11:28 AM

తిరుపతి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి సీక్రెట్ కెమెరా ఉన్న కళ్లజోడుతో అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిన ఓ భక్తుడి వ్యవహారం కలకలం రేపింది. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా వీడియో తీసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన అర్చకుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. దీంతో ఆ భక్తుడి బాగోతం బయటపడింది.

కళ్లజోడులో కెమెరా.. అర్చకుడికి అనుమానం!

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణేకు చెందిన అంకేష్ అగర్వాల్ అలియాస్ అనంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి క్షేత్రానికి దర్శనం కోసం వచ్చాడు. ఈ క్రమంలో సీక్రెట్ కెమెరా అమర్చిన ప్రత్యేక కళ్లజోడు ధరించి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాడు. అయితే కళ్లజోడుతో అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా వీడియో తీసేందుకు ప్రయత్నించినట్లు అర్చకుడి కంటపడింది.

అదే సమయంలో భక్తుడి అనుమానాస్పద కదలికలను గమనించిన ఆలయ అర్చకుడికి కళ్లజోడుపై అనుమానం కలిగింది. ముఖ్యంగా కళ్లజోడుకు అమర్చిన కెమెరా బ్లింక్ అవుతుండటాన్ని గుర్తించాడు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న అర్చకుడు వెంటనే అది సాధారణ కళ్లజోడు కాదని, అందులో రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించాడు.

రంగంలోకి దిగిన సెక్యూరిటీ సిబ్బంది

వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అప్రమత్తమయ్యారు. అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది సదరు భక్తుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌తో పాటు సీక్రెట్ కెమెరా అమర్చిన కళ్లజోడును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు పూణే నుంచి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం అతడిని ఆలయ అధికారులకు అప్పగించారు. కళ్లజోడులోని కెమెరాతో చిత్రీకరించిన వీడియోలను అతడి మొబైల్ ఫోన్ నుంచి తొలగించినట్లు సమాచారం.

మందలించి వదిలేసిన అధికారులు

ఈ ఘటనపై ఆలయ అధికారులు భక్తుడి నుంచి వివరణ తీసుకున్నారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించే విధంగా వ్యవహరించడంపై మందలించి అనంతరం వదిలిపెట్టారు. పవిత్రమైన ఆలయాల్లో భద్రత, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణ ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. సెక్యూరిటీ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us