AP Panchayat Elections: ఈ-వాచ్‌ యాప్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌

|

Feb 03, 2021 | 12:08 PM

AP Panchayat Elections: ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈ-వాచ్‌ యాప్‌ను ఆవిష్కరించారు. కాగా, పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ యాప్‌ను రూపకల్పన చేశారు....

AP Panchayat Elections: ఈ-వాచ్‌ యాప్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌
Follow us on

AP Panchayat Elections: ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈ-వాచ్‌ యాప్‌ను ఆవిష్కరించారు. కాగా, పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ యాప్‌ను రూపకల్పన చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. ఈ యాప్‌ ద్వారా రాష్ట్రంలో ఏ గ్రామం నుంచైనా ఫిర్యాదు చేసేలా యాప్‌ను రూపొందించింది. కాగా, ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. అటు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మధ్య వార్‌ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ యాప్‌ను ఎన్నికల సంఘం అవసరాల కోసం ఈ-వాచ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. రిలయన్స్‌ జియో సహకారంతోనే ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రిలయన్స్‌ జియోకు కృతజ్ఞతలు తెలిపారు. యాప్‌లో సమస్యలువస్తే వెంటనే పరిష్కరించుకుంటామని, గతంలోనూ టెక్నాలజీని ఎన్నికల కోసం వాడామని అన్నారు. అలాగే ఎవరైన ఫిర్యాదు చేసిన సమయంలో కలెక్టర్లు స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, అందుకే అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టాలని నిమ్మగడ్డ సూచించారు.

ఎస్‌ఈసీనీ వైసీపీ మరో రాజకీయపార్టీగా భావిస్తుంది… బడ్జెట్‌పై విజయసాయిరెడ్డివి పచ్చి అబద్దాలన్న సోము వీర్రాజు