Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు

|

Jul 06, 2022 | 3:04 PM

Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తిరుపతి - కాచిగూడ (Tirupati - Kacheguda) మధ్య జులై 7 నుంచి 21వ తేదీ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వాటి వివరాలను చెక్ చేసుకోండి.

Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు
Special Train
Follow us on

Railway News:  తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ – తిరుపతి (Kacheguda – Tirupati) మధ్య జులై 7  తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.  ప్రత్యేక రైలు (నెం.07597) కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జులై 6, 13, 20 తేదీల్లో రాత్రి 10.20 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.00 గం.లకు తిరుపతి చేరుకుంటుంది.

అలాగే ప్రత్యేక రైలు (నెం.07598) తిరుపతి నుంచి జులై 07,14,21 తేదీల్లో మధ్యాహ్నం 03.00 గం.లకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.00 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.

Railway News

ఈ ప్రత్యేక రైళ్లు ఉందానగర్, షాద్ నగర్, జడ్జెర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..