Andhra Pradesh: పోలీస్ స్టేషన్‌లో శాంతి పూజలు.. ఎందుకో తెలిస్తే కంగుతింటారు

|

Mar 07, 2022 | 7:17 PM

ఆ పోలీసుల్లో ఏదో తెలియని భయం, ఆందోళన, టెన్షన్... స్టేషన్‌కు రావాలంటేనే ఒక రకమైన భయం ఫోబియా పట్టుకుంది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరగడం, మానసికంగా ఏదో ఇబ్బందికర పరిస్థితి, ఎక్కడో తప్పు చేశామని భయం ఆ పోలీసులను వెంటాడుతోంది.

Andhra Pradesh: పోలీస్ స్టేషన్‌లో శాంతి పూజలు.. ఎందుకో తెలిస్తే కంగుతింటారు
Pooja At Ps
Follow us on

Kurnool District:  ఆ పోలీసుల్లో ఏదో తెలియని భయం, ఆందోళన, టెన్షన్… స్టేషన్‌కు రావాలంటేనే ఒక రకమైన భయం ఫోబియా పట్టుకుంది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరగడం, మానసికంగా ఏదో ఇబ్బందికర పరిస్థితి, ఎక్కడో తప్పు చేశామని భయం ఆ పోలీసులను వెంటాడుతోంది. పోలీస్ స్టేషన్ లోని బాత్రూంలో డ్యూటీ కానిస్టేబుల్‌ను పాము కాటు వేయడంతో వారి భయం మరింత రెట్టింపయ్యింది.  ఇంకేముంది మంచి బ్రాహ్మణుడిని పిలిపించి పోలీస్ స్టేషన్ లోనే పూజ చేయించారు. తమకు ప్రశాంత జీవనం కావాలని.. టెన్షన్ ఉండకూడదని క్రైమ్ రేట్ తగ్గాలని ప్రార్థనలు చేశారు.  సాధారణంగా ప్రతి దసరా పండుగకి చాలా పోలీస్ స్టేషన్లలో ఆయుధ పూజ చేస్తుంటారు. గత ఏడాది కూడా దసరాకి అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయుధ పూజ చేశారు. ఎందుకో తెలియదు కానీ ఆళ్లగడ్డ(Allagadda) టౌన్ పోలీస్ స్టేషన్లో చేయలేదు. అప్పటినుంచి ఆ భయం వారిని వెంటాడుతోంది. అమ్మవారి ఆగ్రహానికి గురైనట్లు వారికి భయం పట్టుకుంది. దీనికితోడు పోలీస్ స్టేషన్ పరిధిలో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా క్రైమ్ రేట్ బాగా పెరిగింది. ఇటీవలనే భూమా కుటుంబీకులపై వరుసగా నాలుగు కేసులు ఇదే పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya), ఆమె భర్త భార్గవ్ రామ్ తమ్ముడు జగత్ లపై కేసులు నమోదయ్యాయి. ఓ సైకో హల్ చల్ చేశారు. 2 రోజుల క్రితం డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెల్లవారుజామున బాత్రూం వెళుతుండగా  పాము కాటేసింది.. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్న 50 మంది పోలీసుల్లో భయం మరింత పెరిగింది..

దసరా పండగకు ఆయుధపూజ చేయనందుకు అమ్మవారు ఆగ్రహించారు అని వారిలో టెన్షన్ మొదలైంది. తెలిసిన వారు ఇచ్చిన సలహా మేరకు మంచి పేరున్న బ్రాహ్మణుడిని స్టేషన్‌కు పిలిపించి పూజ చేయించారు. శాంతించాలని క్రైమ్ రేట్ తగ్గించాలని వేడుకున్నారు. పోలీసులు చేయించిన అమ్మవారికి శాంతి పూజ నిజంగా ఫలిస్తుందా..? క్రైమ్ రేటు తగ్గుతుందా..? పోలీసుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిపోతాయా అనేది రానున్న రోజుల్లో చూడాలి!

Also Read: ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌లా స్టెప్పులేసిన వధువు.. వరుడు ఫిదా!

పిల్లి కాదు ప్రాణాలను హరించే కలి.. ఇద్దరు మహిళలు, ఓ కుక్క బలి