భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..

| Edited By: Srikar T

Jun 16, 2024 | 1:53 PM

పెరుగుతున్న నిత్యవసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా భగ్గుమంటున్న ధరలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు చికెన్ నుంచి అల్లం, వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలు ఉన్నాయి. గత పది రోజులుగా పెరుగుతున్న ధరలతో మార్కెట్ ధరల బోర్డ్‎లో రేట్లు సాధారణం కంటే రెట్టింపుకు చేరుకున్నాయి. వేసవి దెబ్బతో పాటు దిగుబడి లేక పెరిగిన ధరలతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారస్తులు ఇద్దరు అల్లాడిపోతున్నారు.

భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..
Veg Price
Follow us on

పెరుగుతున్న నిత్యవసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా భగ్గుమంటున్న ధరలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు చికెన్ నుంచి అల్లం, వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలు ఉన్నాయి. గత పది రోజులుగా పెరుగుతున్న ధరలతో మార్కెట్ ధరల బోర్డ్‎లో రేట్లు సాధారణం కంటే రెట్టింపుకు చేరుకున్నాయి. వేసవి దెబ్బతో పాటు దిగుబడి లేక పెరిగిన ధరలతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారస్తులు ఇద్దరు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కూరగాయల కొనాలంటే వంద పెడితే సంచి నిందేది. కానీ ఇప్పుడు రూ.500 పెట్టినా రెండు రకాల కూరగాయలు, ఇద్దరు మనుషులకు సరిపోయేవి రావడం లేదు. ఇక కూరగాయలతో చికెన్ కూడా పోటీ పడుతుంది. కేజీ రూ. 300కు దగ్గరలో ఉన్న చికెన్ ధరలతో అటు కూరగాయలు కొనలేక.. ఇటు చికెన్ తినలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సామన్యులు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పచ్చడి అన్నం తప్పేలా లేదంటున్నారు మధ్యతరగతి ప్రజలు.

ఇక అన్ని వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ధర ఇప్పటికే హాఫ్ సెంచరీకి చేరింది. రేపో మాపో సెంచరీకి చేరువగా దూసుకుపోతోంది. టమాటా ధరలను చూస్తే వంట గదిలో స్టవ్ వెలిగించకుండానే మంటలు వస్తున్నాయి. రైతు మార్కెట్లో కేజీ రూ.50 గా విక్రయించబడుతున్న టమాటా ధర రిటైల్ మార్కెట్లో రూ.60 నుంచి రూ. 70 పలుకుతోంది. రాబోయే రోజుల్లో దీని ధరలు ఎంత పెరుగుతాయో అన్న ప్రశ్న ప్రతిఒక్కరిలో రేకెత్తుతోంది. ఇక మిగతా కూరగాయలు పరిస్థితి కూడా ఇలానే ఉన్నాయి. పచ్చిమిర్చి కేజీ రూ.44 ఉంటే, కాకరకాయ రూ.48, బెండ రూ.30 ,బీరకాయ రూ.44, క్యాలీఫ్లవర్ రూ.40 , క్యారెట్ రూ.45, బంగాళదుంపలు రూ.35, ఉల్లిపాయలు రూ.36 ,అల్లం రూ.194, వెల్లుల్లి రూ. 220 ఉంది. ఇవన్నీ రైతు మార్కెట్ ధరలు అయితే రిటైల్ మార్కెట్‎లో ఇంతకు మించి ఉన్నాయి. ఎండ దెబ్బ.. సకాలంలో వర్షం లేకపోవడం.. దిగుబడి లేకపోవడం ఇలా అనేక కారణాలతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని.. రాబోయే రోజుల్లో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ వర్గాలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…