ఏపీ శాసనమండలి సభ్యురాలిగా పోతుల సునీత.. ధృవీకరణ పత్రాన్ని అందించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

|

Jan 21, 2021 | 7:15 PM

శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో పోతుల సునీత ఎన్నికయ్యారు.

ఏపీ శాసనమండలి సభ్యురాలిగా పోతుల సునీత.. ధృవీకరణ పత్రాన్ని అందించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
Follow us on

pothula sunitha elected as MLC : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో ధృవీకరణ పత్రాన్ని పోతుల సునీతకు గురువారం అందజేశారు. శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో పోతుల సునీత వైఎస్సార్‌సీపీ తరుపున ఒక్కరే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో సునీత ఎన్నిక లాంఛనమైంది. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read Also… స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇటు అధికారులతో ఎస్ఈసీ భేటీ.. అటు సుప్రీంకు ఏపీ సర్కార్..!