Political Challenge: వైసీపీ మేనిఫేస్టో నేను తెస్తా, టీడీపీ మేనిఫెస్టో నువ్వు తీసుకురా.. చర్చకు సిద్ధం అంటూ దేవినేనికి మంత్రి కొడాలి సవాల్..

| Edited By: Pardhasaradhi Peri

Jan 19, 2021 | 12:59 PM

Political Challenge: కృష్ణా జిల్లాలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షకు దిగడంపై

Political Challenge: వైసీపీ మేనిఫేస్టో నేను తెస్తా, టీడీపీ మేనిఫెస్టో నువ్వు తీసుకురా.. చర్చకు సిద్ధం అంటూ దేవినేనికి మంత్రి కొడాలి సవాల్..
Follow us on

Political Challenge: కృష్ణా జిల్లాలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షకు దిగడంపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రోడ్డుపై డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. తాను సింగిల్‌గా వస్తానని, రాష్ట్ర అభివృద్ధిపై ఇద్దరమే మాట్లాడుకుందామని అన్నారు. ప్లేస్ డిసైడ్ చేయాలంటూ దేవినేని ఉమకు సవాల్ విసిరారు. చర్చలో అన్ని సంగతులు బయట పడతాయన్నారు. లేకపోతే ఏ టీవీ ఛానెల్‌లో అయినా చర్చకు తాను సిద్ధమని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను తాను పట్టుకువస్తానని, టీడీపీ మేనిఫెస్టోను పుట్టుకుని ఉమ రావాలంటూ సవాల్ సవాల్ విసిరారు. అయితే సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం టీవీ డిబెట్ అని కూడా చూడనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉంటే.. మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సోమవారం నాడు ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని దేవినేని ఉమను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతనైతే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ గరించి మాట్లాడే మాత్రం బడితే పూజ తప్పదని హెచ్చరించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన దేవినేని ఉమ.. చంద్రబాబు, జగన్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు. చంద్రబాబు, తనపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్, కొడాలి నాని ఎవరైనా వచ్చి టచ్ చేసి చూడండి అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్‌ మేరకు దేవినేని ఉమ ఇవాళ గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు దిగేందుకు ప్రయత్నించారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించారు.

Also read:

Pakistan Approves Sinopharm: అత్యవసర పరిస్థితిల్లో వినియోగానికి చైనా వ్యాక్సిన్ కు అనుమతిలిచ్చిన పాకిస్థాన్

డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిరస్కరించిన జో బైడెన్ టీమ్, ఇక అంతా కొత్త ఉత్తర్వులే ! యూరప్, బ్రెజిల్ దేశాలకు నిరాశ