YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం

|

Apr 06, 2021 | 9:44 PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన కూతురు సునీత ప్రెస్‌మీట్‌ పెట్టడం, విపక్షాల నుంచి కూడా ప్రశ్నలు రావడంతో....

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం
Ys Vivka Murder Case
Follow us on

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన కూతురు సునీత ప్రెస్‌మీట్‌ పెట్టడం, విపక్షాల నుంచి కూడా ప్రశ్నలు రావడంతో దానిపై చర్చ జరుగుతోంది. పవన్‌ విమర్శలు… YS విజయలక్ష్మి బహిరంగ లేఖ నేపథ్యంలో మళ్లీ వైఎస్‌ వివేకా హత్యపై కామెంట్లు, కౌంటర్లు మొదలయ్యాయి. మూడు రోజుల కిందట తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభలో వైఎస్‌ వివేకా హత్య కేసును ప్రస్తావించారు పవన్‌ కల్యాణ్‌. వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా… తన బాబాయి హత్య కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు జనసేనాని. సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

పవన్‌ విమర్శల నేపథ్యంలోనే బహిరంగ లేఖ రాశారు YS విజయలక్ష్మి. వివేకాను ఎవరు హత్య చేశారన్నది నిగ్గు తేలాల్సిందేనని, ఇందులో తమ కుటుంబంలో మరో అభిప్రాయానికి తావు లేదన్నారు. హత్య జరిగినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి ఉన్నారని గుర్తు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఉన్న ఆదినారాయణరెడ్డిని ఆ స్టేజ్‌పైనే పెట్టుకుని పవన్‌ విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అయినా దర్యాప్తు సీబీఐ చేతిలో… అంటే కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉందని తెలిసీ జగన్‌పై విమర్శలు చేశారని తప్పుబట్టారు విజయలక్ష్మి.

వైఎస్‌ విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖపై ప్రశ్నలు సంధించారు TDP నేత పట్టాభి. జగన్‌ సీఎం అయ్యాక… సిట్‌ను మూడుసార్లు ఎందుకు మార్చేశారో చెప్పాలన్నారు. తనకు రక్షణ కల్పించాలని సునీత డీజీపీకి లేఖ రాయలేదా? అని ప్రశ్నించారు. నిందితులను కాపాడటానికే ఇదంతా జరుగుతున్న విషయం తెలియదా అని YS విజయలక్ష్మిని ప్రశ్నించారు పట్టాభి.

Also Read: మరో ట్విస్ట్.. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన ఎస్ఈసీ

థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవ్.. ఆమె పోగొట్టుకున్న బిడ్డే, తనయుడి పక్కన పెళ్లికూతురిగా