Madanapalle: ఏకకాలంలో ముగ్గురితో ప్రేమాయణం… తప్పని వారించినందుకు తండ్రికి చపాతీ కర్రతో మరణశాసనం

|

Jun 18, 2024 | 5:06 PM

దొరస్వామి మొదట స్థానిక జీఆర్టీ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. తర్వాత ప్రమోషం వచ్చి, రెడ్డీస్ కాలనీలోని భాష్యం స్కూలు వెనకాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా వెళ్లారు. దొరస్వామి భార్య లత ఏడాదన్నర కిందట అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి తన 24 ఏళ్ల కూతురు హరితను ఆయనే జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

Madanapalle: ఏకకాలంలో ముగ్గురితో ప్రేమాయణం... తప్పని వారించినందుకు తండ్రికి చపాతీ కర్రతో మరణశాసనం
Love Driven Patricide
Follow us on

ఏ కూతురుకైనా సరే నాన్నే కదా రియల్‌  హీరో. ఆమె ఆనందాల కోసం తను పల్లకయ్యాడు. తనప్రాణానికి ప్రాణంగా పెంచాడు. ఉన్నత చదువులు చదవించి కూతుర్ని ఉన్నతస్థానంలో చూడాలని కలలు కన్నాడు.అంతేకాదు తల్లి లేని లోటు తెలియకుండా తనే అమ్మగా లాలించాడు. తన బంగారు తల్లికి ఏ లోటు ఉండకూడని ఆమె పేరిట కోటి రూపాయిల ప్రాపర్టీ రిజిష్టర్‌ చేశాడు. రేపోమాపో పెళ్లి చేసి ఆమె జీవితానికి పరిపూర్ణత ఇవ్వాలనుకున్నాడు…కానీ…కానీ….ఆయన కలలన్నీ కలల్లలయ్యాయి.. బెత్తంపట్టి ఎందరో విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్‌ను ఇచ్చిన మాస్టారు….నెత్తుటి మడుగులో శవమయ్యారు….కూపీలాగితే చపాతి కర్ర క్రైమ్‌ కథా చిత్రమ్ సంచలనం రేపింది.

మరిచిపోయే సంఘటనా ఇది. పునర్జన్మ మూఢవిశ్వసంతో   కన్నబిడ్డలను కడతేర్చిన విద్యాధిక తల్లితండ్రుల నిర్వాకం అప్పట్లో సంచలనం. ఇప్పటికీ కలకలం. ఇప్పుడు అదే మదనపల్లిలో  మరో ఘోరం…మానవత్వం..మమకారం సిగ్గుతో తలదించుకునే దారుణం. టీచర్ దొరస్వామి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆయన్ని బలితీసుకుంది మరెవరో కాదు..కన్నకూతురేనంటూ క్లారిటీ ఇచ్చారు పోలీసులు.

టీచర్‌ దొరస్వామి కుటుంబం మదనపల్లిలోని పోస్టల్‌ అండ్‌ టెలికామ్‌లో నివాసం ఉంటారు.  ఒక్కగానొక్క కూతురు హర్షిత అంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. అల్లారుముద్దుగా పెంచారు. సాఫీ సాగుతున్న వాళ్ల జీవితంలో ఓ దారుణం. ఏడాది కిందట దొరస్వామి భార్య లత  చనిపోయారు. అప్పటి నుంచి  అమ్మానాన్న తనే అయి హర్షితను కంటికి రెప్పలా చూసుకున్నారు దొరస్వామి. టీచర్‌గా ఎందరో జీవితాలను తీర్చిదిద్దారు. తనలాగే తన కూతుర్ని టీచర్‌గా చూడాలనుకున్నారు. బి.ఈడీ చేయించారు. అమ్మలేని లోటు తెలియకుండా చేసిన నాన్నకు ప్రేమతో ఆయన గౌరవాన్ని పెంచాల్సిందిపోయి…తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుందామె. ఫ్రెండ్‌షిప్‌ పేరిట హద్దులు దాటడం నాన్న కంటపడింది. మందలించారాయన. కానీ ఆమె మారలేదు. ప్రేమ పేరిట టెంప్ట్‌ చేశాడా? లేదంటే తనే ట్రాప్‌లో పడిందా? పాలవ్యాపారం చేసే గణేష్‌ అనే యువకుడితో  స్నేహం…ఇంట్లో తల్లి నగలు తీసుకెళ్లి అతనికి ఇవ్వడం వరకు  వెళ్లింది.  లక్కీ ఛాన్స్‌ అనుకున్నాడో ఏమో అతను ఆ నగల్ని తీసుకెళ్లి ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బుతో ఖుషీ చేశాడు.  విషయం తెలుసుకున్న దొరస్వామి..కూతుర్ని మందలించాడు.  ఫైనాన్స్‌లో పెట్టిన నగల్ని విడిపించాడు. ఇంత  జరిగినా హర్షితలో ఏ మాత్రం మార్పురాలేదు సరికదా. గణేష్‌తో పాటు సాయికృష్ణ అనే యువకుడితో ఫ్రెండ్‌షిప్‌ చేసింది.  అతనికీ   2లక్షలు తీసుకెళ్లి  ఇచ్చింది.  ఇంట్లో డబ్బు కన్పించకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.  ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే  హర్షిత చేస్తున్న నిర్వాకాలు ఇవా…అని నాన్న గుండె కన్నీరైంది.  జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా బుద్దిగా వుండమని నచ్చ చెప్పారాయన. పెళ్లి చేస్తే సెట్‌రైట్‌ అవుతుందనే ఆశతో సంబంధాలు కూడా చూడ్డం మొదలెట్టాడు. కూతురికి మంచి భవిష్యత్‌ ఇవ్వాలని తండ్రిగా ఆయన తాపత్రాయ పడుతుంటే..అవేమి పట్టని హర్షిత  –హరీష్‌ అనే మరో యువకుడితో  దోస్తీ షూరే చేసింది.  తండ్రిగా ఇక తట్టుకోలేకపోయాడు.  నిలదీశాడు. స్నేహం చేస్తే తప్పేంటనేది ఆమె వాదన. రోజులు బాలేవు.. అతిగా ప్రవర్తిస్తే  అమ్మాయి జీవితం ఏమైపోతుందోనని ఆయన ఆవేదన. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. నాన్న చెప్పేది తన మంచికోసమని ఆలోచించాల్సిందిపోయి… తను చేస్తుందనే కరెక్ట్‌ అనే ఇగో  కట్టలు తెంచుకుంది. కట్‌ చేస్తే  దొరస్వామి మాస్టారు రక్తం మడుగులో శవమయ్యారు.

ఈ ఘటన మదనపల్లిలో మరో సంచలనంగా మారింది.  మదనపల్లి డిఎస్పీ  ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టారు. ఖాకీలను ఏమార్చేందుకు ట్రైచేసింది హర్షిత., కానీ ఆ పప్పులుడకలేదు. దొరస్వామి హత్య కేసులో  హర్షితను అరెస్ట్‌ చేశారు పోలీసులు. పక్కా ఆధారాలతో కోర్టుకు నివేదిక సమర్పించారు.

ఏం తక్కువ చేశారని కన్నతండ్రేని  కడతేర్చింది?…. హర్షిత  ఒక్కర్తే  ఈ ఘాతుకానికి పాల్పడిందా?.. దొరస్వామి హత్య కేసులో మరికొందరి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉందా? స్నేహమా..ప్రేమా…దారి తప్పిన బరితెగింపు వ్యవహారమా?…..దర్యాప్తులో ఇంకా సంచలన నిజాలు వెలుగుచూడనున్నాయో? అనే చర్చ జరుగుతోంది స్థానికంగా.  కామం పడగవిప్పితే అది తండ్రినైనా ..కొడుకునైనా …కాటేస్తుందనడానికి ఇలాంటి నిదర్శనాలు కోకొల్లలు.  ఎటు పోతుంది  సమాజం? ఏమైపోతుంది మనిషితనం?.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..