Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన పీపీఏ బృందం.. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తీకరణ..

|

Dec 20, 2020 | 1:56 PM

పోలవరం ప్రాజెక్టు పనులపై పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సంతృప్తి చెందింది. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పీపీఏ బృందం సభ్యులు తెలిపారు.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన పీపీఏ బృందం.. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తీకరణ..
Follow us on

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులపై పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సంతృప్తి చెందింది. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పీపీఏ బృందం సభ్యులు తెలిపారు. ఆదివారం నాడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని పీపీఏ బృందం ప్రాజెక్టు సైట్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడారు. నాలుగు రోజులు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తామన్నారు. పోలవరంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు పనులు సంతృప్తికర స్థాయిలో జరుగతున్నాయని పేర్కొన్నారు. స్పిల్‌ వే, కాంక్రిట్, ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అయితే కుడి, ఎడమ కాలువలకు భూసేకరణ ఎలా ఉన్నది అనే అంశంపై పరిశీలిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే రూ.2,230 కోట్లు విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. పనులు, బిల్లులను పరిశీలించాక మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని అయ్యర్ చెప్పారు.

 

Also read:

Bandi Sanjay Comments: మహబూబ్ నగర్‌ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఇతడేం పోస్ట్‌మ్యాన్‌..రెండేళ్లుగా వచ్చిన ఉత్తరాలు, డాక్యుమెంట్లు దాచేశాడు..లెక్క తీస్తే అధికారులు షాక్ తిన్నారు