Viral Video: రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపి ఏంటని చూసేలోపే ఇది పరిస్థితి!

ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఓ ఖరీదైన జాగ్వార్‌ కారులో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

Viral Video: రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపి ఏంటని చూసేలోపే ఇది పరిస్థితి!
Luxury Jaguar Car Catches Fire On Ongole Highway

Edited By:

Updated on: Aug 27, 2026 | 9:10 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో జాగ్వార్ కారులో మంటలు చెలరేగి ఆ కారు అక్కడికక్కడే కాలిపోయింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేదరమెట్లలో కొందరిని డ్రాప్ చేసి తిరిగి ఒంగోలు వైపు వేగంగా వస్తుండగా.. సౌత్‌బైపాస్‌ సమీపంలోని సంఘమిత్ర ఆసుపత్రి వద్దకు చేరుకోగానే తాను ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు ఇంజిన్ బానెట్‌లో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన అతను, కారును రోడ్డు పక్కన ఆపి వెంటనే కిందకు దిగిపోయాడు.

అతడు కిందకు దిగిన క్షణాల్లోనే మంటలు కారు మొత్తం తీవ్రస్థాయిలో వ్యాపించాయి. దీంతో జాతీయ రహదారిపై నడిరోడ్డులోనే కారు మొత్తం కాలి బూడిదైపోయింది. రోడ్డు కారు తగలబడిపోవడం చూసిన ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఇంజిన్‌లో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సకాలంలో డ్రైవర్ కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us