AP News: కేవలం రూ.2కే చికెన్ బిర్యానీ.. తరలివచ్చిన 2 వేల మంది.. చివర్లో ట్విస్ట్ ఇదే

|

Aug 08, 2024 | 6:16 PM

తాడేపల్లిగూడెంలో 2 రూపాయలకే బిర్యానీ ఆఫర్‌ను చూసిన కొందరు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకేముంది.. చెప్పిన టైంకి ఆ ప్రాంతానికి ఎగబడ్డారు చుట్టుపక్కల ప్రజలు. 2 రూపాయల కాయిన్లతో కొత్త రెస్టారెంట్‌ దగ్గర వాలిపోయారు. ఏకంగా 2 వేల మంది రావడంతో రెస్టారెట్ వారు బిత్తరపోయారు.

AP News: కేవలం రూ.2కే చికెన్ బిర్యానీ.. తరలివచ్చిన 2 వేల మంది.. చివర్లో ట్విస్ట్ ఇదే
Biryani
Follow us on

నార్మల్‌గా బిజినెస్‌ స్టార్ట్‌ చేసేవాళ్లు.. ఎవరికి ఇష్టమొచ్చిన ఆఫర్లు వాళ్లు ఇస్తుంటారు. ఆఫర్లు ఇవ్వడమనేది.. వారివారి బిజినెస్‌ ట్రిక్స్‌లో భాగం. ఆఫర్లు ఇచ్చే దగ్గరకు.. కస్టమర్లు కూడా పరుగులు పెడుతుంటారు. అయితే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారా అని థింక్‌ చేస్తున్నారు కదూ.. ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదులే.. ఇప్పుడు అసలు పాయింట్‌కు వచ్చేద్దాం.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌ సందర్భంగా.. దాని ఓనర్‌ బిర్యానీకి సంబంధించి ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ  అని ప్రచారం చేశారు. 2 రూపాయలకు నోరూరించే చికెన్  బిర్యానీ అని ఫ్లెక్సీలు కూడా ప్రదర్శించారు. దీంతో జనం వేడి వేడి బిర్యానీ తినేందుకు ఎగబడ్డారు. ఏకంగా  2 వేల మంది బిర్యానీ తినేందుకు వచ్చారు. దీంతో వారిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. తొక్కిసలాట జరిగి.. ఆ ప్రాంతమంతా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందడంతో..  సీఐ సుబ్రమణ్యం ఫోర్స్‌తో అక్కడికి వచ్చి.. పరిస్థితిని చక్కదిద్దారు.  రూ.2లకే బిర్యానీ అని చెప్పి..  కేవలం 200 మందికే అలా ఇవ్వటంతో మిగిలిన వారు రెస్టారెంట్ వారిపై అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..