తెలుగు రాష్ట్రాల అడవుల్లో అత్యంత అరుదుగా కనిపించే దీని గురించి మీకు తెలుసా..?

అడవిలో జింక కనిపించడం సాధారణమే. కానీ నాలుగు కొమ్ములతో కనిపించే జంతువు మాత్రం చాలా అరుదు. భారతదేశానికే ప్రత్యేకమైన ఫోర్ హార్న్డ్ ఆంటిలోప్‌ తెలుగు రాష్ట్రాల ఏజెన్సీ అడవుల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. “కొండ గొర్రె”గా పిలిచే ఈ సిగ్గరి జీవి.. నాలుగు కొమ్ములు, మెరుపు వేగం, అడవిలో కలిసిపోయే స్వభావంతో ప్రత్యేక గుర్తింపు పొందింది.

తెలుగు రాష్ట్రాల అడవుల్లో అత్యంత అరుదుగా కనిపించే దీని గురించి మీకు తెలుసా..?
Four Horned Antelope

Updated on: May 27, 2026 | 2:53 PM

అడవిలో జింక కనిపించడం సాధారణమే. కానీ జింకలా జీవి కానీ.. నాలుగు కొమ్ములు ఉంటే?.. అది కూడా ప్రపంచంలో చాలా అరుదైన జాతి అయితే?.. ఇదే ఆ ఆశ్చర్యకరమైన జీవి నాలుగు కొమ్ముల యాంటిలోప్ అంటారు. భారతదేశంలో “చౌసింగా”గా ప్రసిద్ధి చెందిన ఈ జంతువును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు కొండ గొర్రె అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో నాలుగు కొమ్ములు సహజంగా పెరిగే జంతువులు చాలా అరుదు. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది ఈ ఫోర్ హార్న్డ్ ఆంటిలోప్. సాధారణంగా జింకలు లేదా అడవి మేకలకు రెండు కొమ్ములే ఉంటాయి. కానీ ఈ జాతిలో మగ జంతువుకు నాలుగు కొమ్ములు పెరుగుతాయి. ముందు భాగంలో చిన్న జత, వెనుక భాగంలో పెద్ద జత.. ఇలా మొత్తం నాలుగు కొమ్ములు ఉండటం దీని ప్రత్యేకత. ఈ జంతువు ప్రపంచంలో ప్రధానంగా భారతదేశంలోనే కనిపిస్తుంది. పొడి అడవులు, కొండ ప్రాంతాలు, వెదురు పొదల మధ్య జీవించడం వీటికి ఇష్టం.

తెలుగు రాష్ట్రాల్లో నల్లమల అడవులు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలు, ఈస్టర్న్ ఘాట్స్ ఏజెన్సీ బెల్టులు లాంటి చోట్ల అరుదుగా కనిపిస్తుంటుంది. ఫోర్ హార్న్డ్ ఆంటిలోప్ చాలా సిగ్గరి. మనిషి అడుగుల శబ్దం వినిపించినా వెంటనే పొదల్లోకి దూరిపోతుంది. ఎక్కువగా ఒంటరిగానే లేదా జంటగా తిరుగుతుంది. ఇతర జింకల్లా పెద్ద గుంపులుగా కనిపించదు. ఇవి చిన్నగా కనిపించినా చాలా వేగంగా పరుగెత్తగలవు. కొండ ప్రాంతాల్లో రాళ్ల మధ్య చాకచక్యంగా కదులుతాయి. ప్రమాదం వస్తే ఒక్కసారిగా దూకి కనిపించకుండా పోతాయి. ఈ జాతి జంతువులు ఎక్కువగా నీటి వనరులకు దగ్గరగా తిరుగుతాయని అడవి అధికారులు చెబుతుంటారు. అడవిలో చిన్న చెరువులు, వాగులు ఉన్న ప్రాంతాల్లో వీటి జాడలు కనిపించే అవకాశం ఎక్కువ.

కొన్ని భారతీయ పురాతన కథల్లో, వేట సంస్కృతిలో నాలుగు కొమ్ముల జంతువుల ప్రస్తావనలు కనిపిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని శుభ సూచకంగా భావించే నమ్మకాలు కూడా ఉన్నాయి. అడవుల నరికివేత, వేట, మానవ విస్తరణ వల్ల ఈ జాతి సంఖ్య తగ్గుతోంది. అందుకే వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద వీటికి రక్షణ ఉంది. నాలుగు కొమ్ముల ఆంటిలోప్‌ను అడవిలో ప్రత్యక్షంగా చూడటం చాలా అరుదు. చాలామంది ఫారెస్ట్ ట్రెక్కర్లకే ఇది కనిపించదు. అందుకే ఒకసారి కనిపిస్తే అది నిజంగా ప్రత్యేక అనుభవంగా భావిస్తారు.

గుడ్లను కాపాడేందుకు నెలన్నర పాటు గూడు నుంచి కదలదు.. అరుదైన సర్పం.. 

 

Follow Us