కాకినాడలో మాజీ కార్పొరేటర్‌పై.. మున్సిపల్ కమిషనర్ దాడి

| Edited By:

Apr 18, 2020 | 12:54 PM

కాకినాడ మున్సిపల్ కమిషనర్ రమేష్, 40వ వార్డు మాజీ కార్పొరేటర్ మౌళి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో భాగంగా తనపై దాడి మున్సిపల్ కమిషనర్ రమేష్ చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ కార్పొరేటర్. కాగా ఈ దాడిలో మాజీ కార్పొరేటర్ మౌళి,..

కాకినాడలో మాజీ కార్పొరేటర్‌పై.. మున్సిపల్ కమిషనర్ దాడి
Follow us on

కాకినాడ మున్సిపల్ కమిషనర్ రమేష్, 40వ వార్డు మాజీ కార్పొరేటర్ మౌళి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో తనపై మున్సిపల్ కమిషనర్ రమేష్ దాడి చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎక్స్ కార్పొరేటర్. తనవార్డులో గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని.. మున్సిపల్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు మౌళి. దీంతో ఇరువురి మధ్యా సంభాషణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఫిర్యాదు చేయడానికని ఫోన్ చేస్తే.. తనపై మున్సిపల్ కమిషనర్ దుర్భాషలాడారని కాకినాడ టూ టౌన్‌లో ఫిర్యాదు చేశారు మాజీ కార్పొరేటర్ మౌళి. ఫిర్యాదు ఇచ్చిన కొన్ని గంటల్లోనే తెల్లవారు జామున కమిషనర్ సహా 20 మంది సానిటరీ సిబ్బందితో తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని ఎక్స్ కార్పొరేటర్ మౌళి ఆరోపించారు. అడ్డొచ్చిన నాపై, నా కుమారుడిపై కూడా దాడి చేశారని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ కార్పొరేటర్ మౌళి.

Read More: 

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..