Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఈ రోజు తెలుగురాష్ట్రాల్లోని ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

హమ్మయ్య.. ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. అల్పపీడనం ప్రభావంతో గత రెండ్రోజులు ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురువడంతో కాస్త వాతావరణం కూడా చల్లబడింది. ఇన్నాళ్లు ఉక్కపోతతలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈ రోజులు కూడా రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి ఈ రోజులు ఏజిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఈ రోజు తెలుగురాష్ట్రాల్లోని ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
Ap Telangana Latest Weather

Updated on: Sep 13, 2026 | 6:48 AM

తెలుగురాష్ట్రాలకు మరోసారి వావతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. ఇది రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

కోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదన్నారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

ఆదివారం ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

ఆదివారం (13-09-2026) మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఉందన్నారు. రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం.. మెదక్, సిద్దిపేట, యాదాద్రి – భోంగిర్, మేడ్చల్ – మల్కాజిగిరి మీదుగా జనగాం, హన్మకొండ, వరంగల్ మీదుగా కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే వరంగల్, హన్మకొండ, కాజీపేట, యాదాద్రి – భోంగీర్, మహబూబాబాద్, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us