Tomato Price: ధరల్లో హెచ్చుతగ్గులు.. ఇలా చేయాలంటూ ప్రభుత్వానికి టమాట రైతుల డిమాండ్

|

Jan 12, 2022 | 8:40 AM

ఇటీవల కాలంలో టమాట ధర వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఓ రోజు ఈ కూరగాయ ధర భారీగా పెరిగితే, మరోరోజు ఊహించని విధంగా తగ్గిపోయేది.

Tomato Price: ధరల్లో హెచ్చుతగ్గులు.. ఇలా చేయాలంటూ ప్రభుత్వానికి టమాట రైతుల డిమాండ్
Tomato Price Falling
Follow us on

ఇటీవల కాలంలో టమాట ధర వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఓ రోజు ఈ కూరగాయ ధర భారీగా పెరిగితే, మరోరోజు ఊహించని విధంగా తగ్గిపోయేది. ముఖ్యంగా కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఈ సీన్ కనిపించింది. అయితే ఇది రేర్ గా కనిపించే సీన్ కాదు.. నిత్యం అక్కడ జరిగేదే. టమాట రేట్లు ఓ రోజు తక్కువ గాను, మరో రోజు ఎక్కువగా ఉండడంతో అక్కడి రైతుల బాధ వర్ణించేది కాదు. ఎందుకంటే ధర బాగా ఉన్నప్పుడు అమ్ముకోవడానికి అది నిల్వ ఉండేది కాదు. మొన్నటి వరకు కిలో టమాట 100 రూపాయలు పలికిన ధర.. ప్రస్తుతం మార్కెట్ లో ఓ రోజు 40 రూపాయలు, మరో రోజు 20 రూపాయలు పలుకుతుండటంతో రైతులకు, వ్యాపారుల మధ్య గత కొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. అయితే కిలో టమాట ధర 40 రూపాయలు నుండి 50 రూపాయలు ఉంటే తమకు గిట్టుబాటు ఉంటుందని రైతులు అంటున్నారు.

ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు రావడంతో టమాట పంట దెబ్బతినడంతో, గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా కిలో టమాట 100 రూపాయలకు పైగా ధర పెరగడంతో వినియోగదారుల ఆందోళన చెందారు. ఓ రోజు టమాట రేట్లు పెరగడం మరో రోజు తగ్గడం మంచిది కాదని రైతులు అంటున్నారు. ఇలా రేట్లు తగ్గడం, పెరగడం ఉండకూడదు అంటే పత్తికొండ ప్రాంతంలో టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: శుభముహూర్తం లేదంటూ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య.. కోర్టుకెక్కిన భర్త, చివరకు