Anandaiah: ఆనందయ్య విజన్ ఇదే.. పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

|

Sep 29, 2021 | 11:19 AM

నెల్లూరులో కరోనా పసరు మందు తయారీతో ఆనందయ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ్రీగా కరోనా మందును పంపిణీ చేశారు.

Anandaiah: ఆనందయ్య విజన్ ఇదే.. పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు
Anandayya's Covid medicine
Follow us on

కరోనాకు పసరు మందుతో వార్తల్లో నిలిచిన ఆనందయ్య తాజాగా సంచలన ప్రకటన చేశారు. రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని.. బీసీ నేతలంతా కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తున్నట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం పార్టీ రాబోతుందని.. ఏపీలో బీసీల పార్టీకి తాను ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆనందయ్య చెప్పారు. ఏపీలో అన్ని జిల్లాల్లో అఖిల భారత యాదవ సమాఖ్య సమీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదనేది అందరి అభిప్రాయమని.. ఏపార్టీ కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం ఏపీలో నలుగురు మాత్రమే యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఆనందయ్య.. పార్టీలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. సర్పంచిగా పనిచేశానని.. ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నానని.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే ఎమ్మెల్యే కూడా అవుతానని వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆనందయ్య తెలిపారు.  జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని ఆనందయ్య కార్యాచరణ రూపొందిస్తున్నారు. నెల్లూరులో కరోనా పసరు మందు తయారీతో ఆనందయ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ్రీగా కరోనా మందును పంపిణీ చేశారు. జిల్లాలు, గ్రామాల్లో కూడా కరోనా మందును ప్రజలకు అందించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య పసరు మందు బాగా పని చేస్తోందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా అకస్మాత్తుగా త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆనందయ్య ప్రకటించడం సంచలనంగా మారింది.

Also Read: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్

Lakshmi Parvathi: పవన్‌పై లక్ష్మీ పార్వతి ఫైర్.. విష వృక్షం నీడలో ఉన్నారని కామెంట్