వీధిలో రాచనాగు హల్‌చల్.. చివరకు ఏమైందో తెలుసా! ఇదిగో వీడియో

అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం కేజే పురం గ్రామంలో భారీ గిరినాగు కలకలం సృష్టించింది. మసీదు వీధిలో కనిపించిన కింగ్ కోబ్రాను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్ సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును బంధించారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వీధిలో రాచనాగు హల్‌చల్.. చివరకు ఏమైందో తెలుసా! ఇదిగో వీడియో
King Cobra Rescue

Edited By:

Updated on: Nov 17, 2026 | 8:14 AM

అనకాపల్లి జిల్లాలో ఆ గ్రామంలో జనాలకు గుండె ఆగే పని అయింది. కేజే పురంలోని మసీదు వీధి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికులకు ఏదో వింత శబ్దాలు వినిపించాయి. చూసేసరికి ఏదో కదులుతూ ఉన్నట్టు కనిపించింది. కాస్త ఏకాగ్రతతో చూస్తే.. వామ్మో ఒళ్ళు జలదరించే సీన్.. ఓ భారీ గిరినాగు కనిపించడంతో అంతా పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం కేజే పురం గ్రామం మసీదు వీధిలో స్థానికులకు ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళుతున్న వ్యక్తి ఆగి ఒక్కసారిగా చూశాడు. ఏదో కదులుతున్నట్టు కనిపించింది. తొంగి చూస్తే.. భారీ గిరినాగు అతని దృష్టిలో పడింది. దీంతో గుండెలు పట్టుకున్నాడు. స్థానికులకు సమాచారం అందించాడు. విషయం ఆ నోట ఈ నోట పాకింది. స్థానికులు.. అటవీ శాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన.. వెంకటేష్ పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు.

దీంతో ఆపాము అటు ఇటూ పాకుతూ పరుగులు పెట్టించింది. భారీ గిరినాగు వేగంగా పాకుతూ వెళ్తున్న దృశ్యం చూసి అక్కడున్నవారంతా ఒకింత భయానికి గురయ్యారు. గిరినాగు తోలుత చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆ రాచనాగును బంధించేందుకు రెండు గంటలు శ్రమించాల్సి వచ్చింది.

వీడియో చూడండి..

ఎంతో నేర్పుతో కింగ్‌ కోబ్రాను బంధించిన స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్ .. దానిని సురక్షితంగా తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us