Jr NTR: ‘చంద్రబాబు మామయ్యా..! మీరు త్వరగా కోలుకోవాలి’.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా బాబు త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాక్షించారు.

Jr NTR: చంద్రబాబు మామయ్యా..! మీరు త్వరగా కోలుకోవాలి.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
Ntr Cbn

Updated on: Jan 18, 2022 | 6:53 PM

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన చంద్రబాబు.. కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో హోంఐసోలేషన్‌లో ఉన్న బాబు.. ఇటీవల కాలంలో తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు సోమవారం కొవిడ్‌ కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే.

చంద్రబాబుకు కరోనా సోకటంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తారక్ ట్వీట్ చేశారు. ‘మామయ్య చంద్రబాబు గారు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షింస్తున్నా’ అని తారక్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో వింత గుంత కలకలం.. ఎంత తవ్వినా వీడని మిస్టరీ..

స్పెషల్ సాంగ్ కు ‘ఊ’ అనడానికి సామ్ ఎంత తీసుకుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Loading...
Unable to load recommendations.
Follow Us