Pawan Kalyan: పొత్తుల‌పై తొలిసారి స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏమ‌న్నారంటే..

|

Jan 11, 2022 | 10:59 PM

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పొత్తుల అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మయానికి ఏయే పార్టీలు పొత్తులు పెట్టుకోనున్నాయ‌న్న దానిపై ఇప్ప‌టి నుంచే చ‌ర్చ మొద‌లైంది. తాజాగా..

Pawan Kalyan: పొత్తుల‌పై తొలిసారి స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏమ‌న్నారంటే..
Follow us on

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పొత్తుల అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మయానికి ఏయే పార్టీలు పొత్తులు పెట్టుకోనున్నాయ‌న్న దానిపై ఇప్ప‌టి నుంచే చ‌ర్చ మొద‌లైంది. తాజాగా కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌నసేన‌తో పొత్తుల విష‌య‌మై టీడీపీ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandra Babu Nayudu) వ్యాఖ్యానిస్తూ.. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశంపై జ‌న‌సేత అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) తొలిసారి స్పందించారు. పొత్తుల‌పై ఒక్కడినే నిర్ణ‌యం తీసుకోన‌ని తేల్చి చెప్పిన జ‌న‌సేనాని అంద‌రితో చ‌ర్చించాకే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. పొత్తుల గురించి అంద‌రం క‌లిసి ఒక‌టే మాట మాట్లాడుకుందాం. మ‌నం ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తులో ఉన్నాం. అలాగే.. ర‌క‌ర‌కాల పార్టీలు మ‌న‌తో పొత్తు కొరుకోవ‌చ్చు. దానిని మైండ్ గేమ్ అన‌నివ్వండి ఏ పేరైనా స‌రే.. మ‌నం మాత్రం అంద‌రం ఒకే మాట మాట్లాడుదామ‌ని చెప్పుకొచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇక ముందు పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి సారిద్దామ‌ని పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు.

మ‌న బ‌లం పూర్తిగా పుంజుకున్న త‌ర్వాత జ‌న‌సైనికులు, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల స‌ల‌హాలు తీసుకొని పొత్తుల విష‌యంలో ముందుకు వెళ్దామ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. దీంతో మ‌రోసారి టీడీపీ, జ‌నసేన‌ల మ‌ధ్య పొత్తుల అంశం తెర‌పైకి వ‌చ్చింది. ప‌వ‌న్ టీడీపీతో పొత్తుకు సై అన‌డానికి ఆస‌క్తి చూపిస్తార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఎన్నిక‌ల నాటికి ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో చూడాలి.

Also Read: World Record: ముద్దుగుమ్మ రికార్డులు బద్దలు.. 50 మిలియన్లకు పైగా లైక్‌లు.. అదే ఈ ‘గుడ్డు’ స్పెషల్..

SBI Fraud: గూగుల్‌లో నెంబ‌ర్‌ సెర్చ్ చేసి కాల్ చేశాడు.. రూ. 5 ల‌క్ష‌లు పోగోట్టుకున్నాడు..

Malavika Hegde:వేల కోట్ల అప్పులెదురైనా కుంగిపోలేదు, పారిపోలేదు.. దటీజ్‌ మాళవికా హెగ్డే..