Dy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా తొలిసారి.. ఆసక్తి రేపుతున్న పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన..!

|

Jun 30, 2024 | 7:07 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

Dy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా తొలిసారి.. ఆసక్తి రేపుతున్న పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన..!
Pawan Kalyan Kakinada Tour
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. తొలిరోజు గొల్లప్రోలులో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై, పలు అంశాలపై చర్చిస్తారు. నియోజకవర్గ సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనున్నారు. ఇక జులై 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

జులై 3న ఉదయం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని డిఫ్యూటీ సీఎం పవన్ పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ మూడు రోజులు పర్యటనను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఏర్పాట్లు కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి, వివిధ శాఖల మంత్రి హోదాలో మొట్ట మొదటిసారిగా పిఠాపురం వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్వాగతం పలికేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం అయ్యారు.

మరోవైపు పవన్‌ షెడ్యూల్‌ ఖరారు కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ కనిపిస్తుంది. పవన్‌ను స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి వస్తుండటంతో గ్రాండ్‌గా వెల్‌ కమ్‌ చెప్పడానికి రెడీ అయ్యారు. అటు అభిమానల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. అయితే మరోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు పవన్‌. తనకు కేటాయించిన శాఖలపై పూర్తిగా అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. శాఖల స్థితిగతులు, నిధులు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై కసరత్తు చేస్తున్నారు. తనదైన శైలిలో కొత్త నిర్ణయాలు తీసుకుని, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…