ఆ ఐపీఎస్‌ అధికారి సస్పెన్షన్‌ పొడిగింపు.. సమీక్ష కమిటీ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నామన్న ఏపీ సీఎస్‌

|

Feb 03, 2021 | 6:00 PM

ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. గతంలో విధించిన సస్పెన్షన్‌ను..

ఆ ఐపీఎస్‌ అధికారి సస్పెన్షన్‌ పొడిగింపు.. సమీక్ష కమిటీ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నామన్న ఏపీ సీఎస్‌
adityanath das
Follow us on

ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. గతంలో విధించిన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్‌ అధికారి సస్పెన్షన్‌పై సమీక్షించిన కమిటీ సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు నిన్నటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ప్రకటించారు.

వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ కోరింది, ఏసీబీ విజ్ఞప్తిపై గత నెల 19న ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని సీఎస్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వెంకటేశ్వరరావుపై దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని సమీక్ష కమిటీ చేసిన సిఫార్సు చేసినట్టు సీఎస్‌ తెలిపారు. ఈ ప్రభుత్వం సస్పెన్షన్‌ పొడిగింపు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆధిత్యనాథ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి :

ఎస్‌ఈసీ ఈవాచ్ యాప్‌పై రగులతున్న వివాదం.. ముమ్మాటికి నిమ్మగడ్డ పర్సనల్‌ యాప్‌ అంటున్న వైసీపీ నేతలు