Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Jul 21, 2024 | 1:56 PM

ఎడతెగని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న నాన్‌స్టాప్‌ వానలతో..వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో.. పదులసంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Follow us on

ఎడతెగని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న నాన్‌స్టాప్‌ వానలతో..వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో.. పదులసంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా.. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల నచేసింది. ఆదివారం (21-07-2024) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపధ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేర రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ , రిలీఫ్ ఆపరేషన్స్ కు మొత్తంగా 21.50కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల అధికారులతో సమన్వయ పరుచుకుని సహాయక చర్యలకు మాడు ఎన్డీఆర్ఎఫ్ ( 1కోనసీమ, 1తూర్పుగోదావరి, 1అల్లూరి), మూడు ఎస్డీఆర్ఎఫ్ ( 2ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించారు. దీంతోపాటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో 10 జిల్లాలకు అలర్ట్..

తెలంగాణలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఈ క్రమంలో తెలంగాణలోని 10 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ ,వికారాబాద్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీవర్షాల పడే అవకాశం ఉందని హెచ్చరించింది. నారాయణపేట, నిజామాబాద్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్ జిల్లలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..