AP Weather: ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు

|

Jul 19, 2024 | 1:42 PM

ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు .. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా వరద ముంపు పరిస్థితులు, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసున్నారు. ఇప్పటికే ఏలూరు కలెక్టర్‌, ఎస్పీతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెద్దవాగు బాధితులను ఆదుకోవాలని సూచించారు. ఏపీ వెదర్ రిపోర్ట్ తెలుసకుందాం పదండి...

AP Weather: ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
Andhra Weather
Follow us on

ఈరోజు వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలలో అనగా పూరీకి ఆగ్నేయంగా 70 కిమీ (ఒడిశా), గోపాల్‌పూర్ (ఒడిషా)కి తూర్పున 130 కిమీ, పారాదీప్ (ఒడిషా)కి ఆగ్నేయంగా 130 కిమీ, కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కి తూర్పు-ఈశాన్యంగా 240 కి.మీ. అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉన్నది . ఇది రేపు, జూలై 20, 2024 తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి, పూరీ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఒడిశా & ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుంది. సగటుసముద్ర మట్టానికి 1.5 కి.మీ వద్ద ఉన్న ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, రాయ్‌పూర్, పూరీ మీదుగా ఆగ్నేయ దిశగా ఒడిశాను ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాల నుండి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం మధ్యలోకి వెళుతుంది.సగటు సముద్ర మట్టం నుండి 3.1 & 5.8 కిమీల మధ్య షీర్ జోన్ సుమారుగా 20° ఉత్తర అక్షాంశము వద్ద దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

శుక్రవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

శనివారం;- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది.  భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

శుక్రవారం : తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

శనివారం;- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది .

రాయలసీమ :-

—————-

శుక్రవారం : తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శనివారం;-  తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఆదివారం :-  తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.