బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే అదిరిపోయే ఆఫర్.. ఏడాదికి రూ.2 కోట్ల జీతం కొట్టేసిన తెలుగు యువకుడు!

IIT Chennai 2 crore package: ఐఐటి చెన్నై కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ధర్మతేజ రెడ్డి ఏడాదికి 2 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీతో ఐఎంసి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాడు. కడప జిల్లాకు చెందిన ఈ యువకుడు, ముంబై క్యాంపస్ ఇంటర్వ్యూలో సత్తా చాటాడు. దేశంలోనే ఉండి కూడా కోట్లు సంపాదించవచ్చని నిరూపించిన ధర్మతేజ రెడ్డి కథ యువతకు స్ఫూర్తిదాయకం. ఇది సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను తెలియజేస్తుంది.

బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే అదిరిపోయే ఆఫర్.. ఏడాదికి రూ.2 కోట్ల జీతం కొట్టేసిన తెలుగు యువకుడు!
Dharma Teja Reddy Software Job

Edited By:

Updated on: Nov 15, 2026 | 9:06 PM

ఎన్ని ఉద్యోగాలు ఉన్నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఉన్న కిక్కే వేరు. అతి చిన్న వయసులోనే కోట్లలో జీతాలు తీసుకోవడం అనేది ఆ ఉద్యోగాలకే చెల్లుబాటు అవుతుంది. ఒక్కొక్కరు బీటెక్‌లు చేసి ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటే.. ఇంకొందరు ఫైనల్ ఇయర్‌లోనే అబ్బురపరిచే జీతాలతో ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా అదే అంశం. కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఏకంగా ఏడాదికి రెండు కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగం సంపాదించాడు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ధర్మతేజ రెడ్డి అనే యువకుడు రెండు కోట్ల రూపాయల వార్షిక ప్యాకేజీ తో ఉద్యోగం సాధించాడు. చెన్నై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో నాలుగవ సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు.. ముంబైలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ సత్తా చాటాడు. ఐఎంసీ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఏదో ఏడాదికి 30 లక్షలు 40 లక్షలు కాదు.. ఏకంగా ఏడాదికి రెండు కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం అంటే నెలకు దగ్గర దగ్గర 8.30 లక్షల రూపాయల జీతం అన్నమాట. ధర్మతేజ రెడ్డి తండ్రి ఎర్రగుంట్లలోని స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీలో ట్రాన్‌స్పోర్ట్ ఉద్యోగం నిర్వహిస్తున్నారు. వచ్చేనెల డిసెంబర్ మూడవ తేదీన తమ కుమారుడు ఐఎంసి కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవుతున్నట్లు తల్లిదండ్రులు రమణారెడ్డి, తులసి తెలిపారు. ఎక్కడో అమెరికాకు లేదా వేరే ఇతర దేశానికో వెళ్లి కోట్లు సంపాదించడం కాదు మన ప్రదేశంలో ఉండి కూడా కోట్లు సంపాదించవచ్చు అని ధర్మతేజ రెడ్డి నిరూపించాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us