AP High Court: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు.. నేడు కీలక ఉత్తర్వులు ఇవ్వనున్న హైకోర్టు ధర్మాసనం..

|

Jan 21, 2021 | 7:53 AM

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును ఇవ్వనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో..

AP High Court: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు.. నేడు కీలక ఉత్తర్వులు ఇవ్వనున్న హైకోర్టు ధర్మాసనం..
Follow us on

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును ఇవ్వనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ వాదనలు పూర్తి అయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీర్పును గురువారం వెల్లడిస్తామని హైకోర్టు మంగళవారం ప్రకటించింది. ఆ మేరకు ఇవాళ ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. అయితే, హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఒకవేళ హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలిందనే భావించాలి. అలా కాకుండా ఎన్నికలను నిలిపివేస్తే.. ఎస్ఈసీకి దూకుడుకు బ్రేక్ వేసినట్లు అవుతుంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ను ఆశ్రయించగా.. సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత పిటిషన్‌నపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Also read:

అధికారులకు అడ్డం తిరిగిన రైతులు.. తమ భూములకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్‌

Kala Venkat Rao Arrest: కళా వెంకట్రావును అందుకే అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది.. చట్టం ముందు అందరూ సమానమే