అధికారులకు అడ్డం తిరిగిన రైతులు.. తమ భూములకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్‌

మహబూబబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్దఎల్లాపూర్ పరిధిలో పోడు భూముల్లో ఫారెస్ట్‌ అధికారులు ట్రెంచ్‌ పనులు చేస్తుండగా రైతులు

అధికారులకు అడ్డం తిరిగిన రైతులు.. తమ భూములకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్‌
Follow us

|

Updated on: Jan 21, 2021 | 7:46 AM

మహబూబబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్దఎల్లాపూర్ పరిధిలో పోడు భూముల్లో ఫారెస్ట్‌ అధికారులు ట్రెంచ్‌ పనులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్‌ల సహకారంతో గంగారం ఫారెస్ట్‌ అధికారి చలపతిరావు అక్కడికి చేరుకున్నారు.

ఒక కంపార్ట్‌మెంట్‌లో అడ్డుకోగా మరో కంపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ కూడా గిరిజన రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా సహకరిస్తామని అటవీశాఖాధికారులు హామీ ఇచ్చినా రైతులు శాంతించలేదు. తమ భూములను లాక్కుంటే ఊరుకునేదిలేదని, రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

సర్వే నిర్వహించి అర్హులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెను తిరిగారు. తమ గ్రామంలో కొన్ని ఏండ్లుగా భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని అధికారులను రైతులు కోరారు.