AP Weather: బలపడుతున్న అల్పపీడనం.. తుఫాన్‌గా మారే చాన్స్.. ఆంధ్రాకు వర్షసూచన

|

May 23, 2024 | 2:04 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... క్రమంగా బలపడుతుంది. శుక్రవారం వాయుగుండంగాను ఆ తర్వాత తీవ్రవాయుగండం గాను.. తుఫానుగా మార్పు చెందే అవకాశం ఉంది. తుఫాన్ గా మారితే 'రెమాల్' గా నామకరణం చేయనున్నారు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: బలపడుతున్న అల్పపీడనం.. తుఫాన్‌గా మారే చాన్స్.. ఆంధ్రాకు వర్షసూచన
Andhra Weather Report
Follow us on

పశ్చిమ మధ్య & దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఈరోజు 23 మే, 2024 ఉదయం ఎనిమిదన్నర గంటలకు తీవ్ర అల్పపీడన ప్రాంతంగా ఏర్పడినది . ఈ తీవ్ర అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో మే 24 తేదీకల్లా వాయుగుండముగా బలపడే అవకాశముంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం మీద మే 25 ఉదయానికి తుఫానుగా మరింత తీవ్రమవుతుంది. తదనంతరం, అది దాదాపు ఉత్తరం వైపుకు వెళ్లి ,మే 26 సాయంత్రం నాటికి బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాలను తీవ్రమైన తుఫానుగా బలపడే అవకాశముంది. ఈ క్రమంలో రాబోవు 3 రోజులు వాతావరణ సూచలను ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

శుక్రవారం;-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రేడు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

శుక్రవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

——————-

గురువారం, శుక్రవారం, శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో ) వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.