Andhra Pradesh: ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. వేధించిన పోకిరిని ఏం చేసిందో వీడియోలో చూడండి..

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళా ఉద్యోగినిని రోడ్డుపై బైక్‌తో వెంబడించి వేధించాడో పోకిరి. భయపడి లొంగిపోతుందనుకున్నాడు.. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ మహిళ ఏమాత్రం బెదరకుండా ఎదురుతిరిగి నడిరోడ్డుపై చెప్పుతో చెంపలు వాయించింది. స్థానికులు అతడి చేతులు కట్టేసి చితకబాదారు. శ్రీకాకుళం జిల్లా మందసలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. వేధించిన పోకిరిని ఏం చేసిందో వీడియోలో చూడండి..
Harasser Thrashed By Woman Employee

Edited By:

Updated on: Oct 07, 2026 | 4:55 PM

రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళా ఉద్యోగిని వెంటాడి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ఆకతాయికి స్థానికులు, బాధిత మహిళ కలిసి తగిన బుద్ధి చెప్పారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలో చోటుచేసుకుంది. ఓ మహిళా ఉద్యోగిని తన విధులు ముగించుకుని మందస మండలం హరిపురం నుంచి స్కూటీపై 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కంచిలి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో పెద్దకేసుపురం గ్రామానికి చెందిన ఎం. బాలకృష్ణ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై ఆమెను వెంబడించాడు. మార్గమధ్యంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. పోకిరి తీరుతో విసిగిపోయిన సదరు మహిళ ధైర్యంగా వాహనాన్ని ఆపి అతడిని గట్టిగా నిలదీసింది. రోడ్డుపై గొడవ జరుగుతుండటం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మహిళకు అండగా నిలిచారు. ఆకతాయి బాలకృష్ణను పట్టుకుని, తప్పించుకోకుండా చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. బాధితురాలు సైతం తీవ్ర ఆగ్రహంతో అతడి చెంపలు చెప్పుతో వాయించింది.

అనంతరం బాధితురాలు పోలీసులకు సమాచారం అందించడంతో మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అతడి చేతులకు ఉన్న తాడును విప్పగానే, అతడు వారి కళ్లుగప్పి పరారయ్యేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికుల సాయంతో అతడిని వెంబడించి పట్టుకున్నారు. పోకిరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతని మానసిక స్థితిపై కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై వేధింపులకు పాల్పడితే మహిళలు ధైర్యంగా తిరగబడాలని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు సూచించారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us