Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అద్భుత ఘట్టం.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా..

|

Feb 22, 2021 | 8:59 PM

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ వరప్రధాయినిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అద్భుత ఘట్టం.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా..
Follow us on

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ వరప్రధాయినిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలతో ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు గేట్లకు హైడ్రాలిక్ సిలెండర్లను ఏర్పాటు చేశారు. రికార్డు వేగంతో పనులు పూర్తి చేస్తున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థ..జర్మనీకి చెందిన మౌంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి భారీ సిలిండర్లను దిగుమతి చేసుకున్నారు. ఈ సిలిండర్లను అమర్చేందుకు మౌంట్ హైడ్రాలిక్ ఇంజనీర్లు ఏపీకి రాగా.. పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల ఏర్పాటును ప్రారంభించారు. ఇప్పటికే విజయవంతంగా మొదటి గేటుకు హైడ్రాలిక్ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చడం దేశంలో ఇదే తొలిసారి.

ఇదిలాఉంటే, ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ సిలిండర్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ లెక్కన 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చనున్నారు. ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ పొడవు 17.308 మీటర్లు ఉండగా.. దాని బరువు దాదాపుగా 20 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇక హైడ్రాలిక్ టెక్నాలజీతో గేట్లను ఎత్తడం దేశంలోనే పోలవరంలో మొదటిసారి. ఈ హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో నిమిషానికి అర మీటరు చొప్పున గేటును ఎత్తే అవకాశం ఉంటుంది. ఇక పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లకు 24 పవర్ ప్యాక్ సెట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు. ఇప్పటికే వపర్ ప్యాక్ రూమ్‌ను మెఘా సంస్థ ప్రారంభించింది. మరోవైపు స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు ఏర్పాటు చేయడం కూడా పూర్తయ్యింది. గడ్డర్లు పని పూర్తికావడంతో ఇప్పుడు హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చే పనులను ప్రారంభించారు.

Also read:

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక.. అత్యల్ప ఉష్ణోగ్రతలతో పాటు చలిగాలులు

అసహాయ బాలిక ప్రాణదాతలు వారు, తమ పెళ్లిరోజున రక్తదానం చేసిన దంపతులు