Telangana Weather: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక.. అత్యల్ప ఉష్ణోగ్రతలతో పాటు చలిగాలులు

తెలంగాణలో వాతావరణం ఆకస్మాత్తుగా మారిపోయింది. చలిగాలు వీస్తున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్‌కు వస్తున్నా చలి పులి వణికిస్తుంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 7:56 pm, Mon, 22 February 21
Telangana Weather: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక.. అత్యల్ప ఉష్ణోగ్రతలతో పాటు చలిగాలులు

Telangana Weather:  తెలంగాణలో వాతావరణం ఆకస్మాత్తుగా మారిపోయింది. చలిగాలు వీస్తున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్‌కు వస్తున్నా చలి పులి వణికిస్తుంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత కూడా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్న విషయం తెలిసిందే.  ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబతుతున్నారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో  ఉదయం అక్కడక్కడ తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఈశాన్య బీహార్‌ నుంచి ఆగ్నేయ అరేబియన్‌ సముద్రం వరకు ఏర్పడి ఉన్న పశ్చిమ గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి.. ఆదివారం నాగాలాండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, దక్షిణ కర్ణాటక తీరం మీదుగా లక్ష ద్వీప్‌ వరకు ఏర్పడి ఉందని వివరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్టోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు) 13.3 డిగ్రీలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో బండ్లగూడలో అత్యల్పంగా 16.6 డిగ్రీలు

Also Read:

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో

హైదరాబాద్ పోలీసులు రాక్స్.. దొంగలు షాక్.. ఇది కదా ప్రజలకు కావాల్సిన స్పీడ్