Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..

|

Jun 26, 2024 | 4:36 PM

Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నరసరావుపేట ఎస్పీ ఆఫీసుకు పోలీసులు పిన్నెల్లిని తరలిస్తున్నారు.

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
Pinnelli Ramakrishna Reddy
Follow us on

Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నరసరావుపేట ఎస్పీ ఆఫీసుకు పోలీసులు పిన్నెల్లిని తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంస కేసు, ఎన్నికల సమయంలో అల్లర్లు, తదితర కేసులు ఉన్నాయి. పాల్వాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసంతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు.

కాగా.. మే 13న జరిగిన ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు దగ్గర ఈవీఎంను ధ్వంసం చేశారు. అనంతరం సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టాయి.. వీడియోల ఆధారంగా ఈసీ, పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత అల్లర్లలోనూ పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి.. కేసులు నమోదు చేసినప్పటి నుంచి నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఇంట్లోనే పిన్నెల్లి ఉంటున్నారు. మధ్యంతర బెయిల్ టైమ్‌లో రోజూ ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం పెడుతూ వస్తున్నారు. కాగా.. పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి.

పిన్నెల్లి అరెస్ట్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..