తాను మళ్లీ ఎమ్మెల్యే కాకపోయినా ఫర్వాలేదు.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగాల్సిందే.. నా రాజీనామాను ఆమోదించండి.!

|

Mar 25, 2021 | 10:10 PM

తాను మళ్లీ ఎమ్మెల్యే కాకపోయినా.. ఫర్వాలేదు. కాని విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగలంటున్నారు గంటా శ్రీనివాస్ రావు. తన రాజీనామా ఆమోదం పొందినా తర్వాత.. మళ్లీ పోటీ చేయబోనని స్పష్టం చేస్తున్నారు.

తాను మళ్లీ ఎమ్మెల్యే కాకపోయినా ఫర్వాలేదు.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగాల్సిందే.. నా రాజీనామాను ఆమోదించండి.!
Follow us on

Ganta Srinivasa Rao: తన రాజీనామాను ఆమోదించాలని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. జేఏసీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని ప్రకటించారు. గంటా శ్రీనివాసరావు తన పాత మిత్రుడన్న తమ్మినేని.. స్పీకర్‌ ఫార్మాట్‌లో తన రాజీనామాను ఆమోదించాలని కోరినట్లు వివరించారు.

స్టీల్ ప్లాంట్ కోసం గంటా పదవీత్యాగానికి తన సహకారమందిస్తానన్నారు. రాజీనామా ఆమోదం తర్వాత కూడా తాను ఆ స్థానం నుంచి పోటీ చేసేది లేదని అంటున్నారు గంటా శ్రీనివాస్. స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ ఎంపీలు ప్రయోగిస్తామన్న రాజీనామాల ఆఖరు అస్త్రాన్ని ప్రయోగించాల్సిన టైమ్ వచ్చిందన్నారు.

అప్పట్లో ప్రత్యేక హోదా కోసం ప్రయోగించిన అస్త్రాన్నే ఇప్పుడు సీఎం జగన్ బయటకు తియ్యాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తన రాజీనామా లేఖను ఇచ్చిన గంటా. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని గంటా చెప్తున్నారు. దీనిపై అధికార పార్టీనే కార్యాచరణ రూపొందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద రాజీనామా చేశారు గంటా. దానిపై విమర్శలు రావడంతో.. మళ్లీ ఉద్యోగుల ముందే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు. ఉక్కు ఉద్యమంలో కలిసి రావాలంటూ అధికార వైసీపీకి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రస్తుత తరుణంలో గంటా స్ట్రాటజీ చర్చనీయ అంశంగా మారింది. అయితే స్పీకర్ ఆఫీస్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాబోతుందన్నదే ఇప్పుడు ప్రశ్న.

ఇవి కూడా చదవండి : Jagananna Vidya Deevena: తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన డబ్బులు పడేది అప్పుడే.. సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల