సస్పెన్షన్‌ ముగిసింది.. పూర్తి జీతం ఇవ్వండి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వేంకటేశ్వర రావు లేఖ

|

Mar 25, 2022 | 12:50 PM

తనను ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు ఆయన లేఖ రాశారు.

సస్పెన్షన్‌ ముగిసింది.. పూర్తి జీతం ఇవ్వండి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వేంకటేశ్వర రావు లేఖ
Ab Venkateswara Rao Ips
Follow us on

AB Venkateswara Rao letter to AP CS: తనను ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌(Former Intelligence Chief), ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ(Sameer Sharma)కు ఆయన లేఖ రాశారు. సస్పెన్షన్ కు 2022 ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిందని, రెండేళ్లు నిండిన కారణంగా రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా తొలగిపోయినట్లేనని లేఖలో పేర్కొన్నారు.

సస్పెన్షన్‌ ఆరేసి నెలల చొప్పున పొడిగింపు జనవరి 27తో ముగిసిందని.. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి అని లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గడువులోపు కేంద్రహోంశాఖ నుంచి అనుమతి తీసుకోనందున అది ముగిసినట్లేనని చెప్పారు. సస్పెన్షన్‌ తొలగినందున సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం తనకు పూర్తి జీతం ఇవ్వాలని కోరారు. గడువులోగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు కాబట్టి….సస్పెన్షన్ ముగిసినట్లేనన్నారు. ఈ లెక్కన.. 31.7.2021న చివరిసారిగా నా సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఇచ్చిన జీఓను రహస్యంగా ఉంచారని, నాకు కాపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లేక అందలేదన్నారు. అన్ని వివరాలను పరిశీలించి తన పూర్తి సాలరీ ఇవ్వాలంటూచీఫ్ సెక్రటరీకి AB వేంకటేశ్వర రావు లేఖ రాశారు.

Read Also…  Tirumala Temple: టీటీడీకి ప్రవాస భక్తుడు భారీ విరాళం.. ఛైర్మన్‌కు డిడి అందజేత