AP Liquor Shops Lottery: అబ్బా.. నక్క తోక తొక్కాడు.. ఒక వ్యక్తికి ఎన్ని షాపులు చిక్కాయంటే

|

Oct 14, 2024 | 8:38 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ సోమవారం లాటరీ డ్రా ద్వారా వైన్‌ షాపుల కేటాయింపునకు సంబంధించిన 86 శాతం ప్రక్రియను పూర్తి చేసింది. తిరుపతిలో మొత్తం 227 షాపుల్లో అత్యధికంగా 197 షాపులను కేటాయించగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన 182 షాపులను అధికారులు కేటాయించారు. విశాఖపట్నంలో 155 దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది.

AP Liquor Shops Lottery: అబ్బా.. నక్క తోక తొక్కాడు.. ఒక వ్యక్తికి ఎన్ని షాపులు చిక్కాయంటే
Ap Liquor Shops Lottery
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ సోమవారం లాటరీ డ్రా ద్వారా వైన్‌ షాపుల కేటాయింపునకు సంబంధించిన 86 శాతం ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం 3396 నోటిఫైడ్ షాపుల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 2917 షాపులను కేటాయించగా, మిగిలిన 479 పెండింగ్‌లో ఉన్నాయి. తిరుపతిలో మొత్తం 227 షాపుల్లో అత్యధికంగా 197 షాపులను కేటాయించగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన 182 షాపులను అధికారులు కేటాయించారు.

విశాఖపట్నంలో 155 దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. దీని తర్వాత ప్రకాశం జిల్లాలో 171 దుకాణాలకు గాను 155 దుకాణాలు వచ్చాయి. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, గుంటూరు సహా 13 జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. సంబంధిత జిల్లాల్లో కలెక్టర్‌, ఇతర ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో వైన్‌ షాపులను కేటాయించేందుకు లాట్‌ డ్రా సజావుగా జరిగేలా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇదిలా ఉంటే ఈ లాటరీ కొందరికి చాలా కలిసొచ్చింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకి 5 దుకాణాలు దక్కించుకున్నారు. .ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4.. ధర్మవరం రూరల్‌లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నంబర్ దుకాణాలు దక్కాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు ఒకే వ్యక్తికి రావడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది.