డేంజర్ బెల్స్ మోగిస్తున్న డయేరియా.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

|

Jun 26, 2024 | 8:29 PM

జగ్గయ్యపేటలో డయేరియా డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. ఓ వైపు రికవరీ అవుతుంటే.. మరోవైపు కొత్త కేసులు పెరుగుతున్నాయి. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీయార్‌జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా విజృంభిస్తోంది. పాత కేసులు తగ్గుతుంటే కొత్తగా డయేరియా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

డేంజర్ బెల్స్ మోగిస్తున్న డయేరియా.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
Krishna District
Follow us on

జగ్గయ్యపేటలో డయేరియా డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. ఓ వైపు రికవరీ అవుతుంటే.. మరోవైపు కొత్త కేసులు పెరుగుతున్నాయి. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీయార్‌జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా విజృంభిస్తోంది. పాత కేసులు తగ్గుతుంటే కొత్తగా డయేరియా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పారిశుద్ధ్య నిర్వహణ లోపం కళ్ల ముందే కనిపించడంతో అధికారులపై మండిపడ్డారు. ముక్త్యాల, రావిరాల గ్రామాల్లో కొత్తగా కేసులు నమోదు కావడంపై ఆయన ఆరా తీశారు. ఒకవైపు తగ్గుతున్నా మరోవైపు కొత్త కేసులు నమోదు కావడంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో డయేరియా ప్రబలిన అన్ని ప్రాంతాలను ఆర్డీ నాగ నరసింహారావు పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీరులో క్లోరిన్ శాతాన్ని ఆయన పరీక్షించారు. నాగ నరసింహారావు ఆదేశాలతో డయేరియా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్, సిబ్బంది పర్యటించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసినీ సహా ఇతర డాక్టర్లంతా నియోజవర్గంలోనే ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నారు. జగ్గయ్యపేటలో ఇప్పటికే 79కేసులు నమోదు కావడం..పలువురు మృతిచెందడం, వరుసగా కొత్త కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం పెద్దయెత్తున చర్యలు చేపట్టారు. మరోవైపు డయేరియా బాధితులతో ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. రికవరీకన్నా..కొత్త కేసులు ఎక్కువ వస్తుండటం అధికారులను కలవరపెడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…