ఏపీలో ఫైళ్ల దగ్ధం ఘటనలపై దుమారం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. రంగంలోకి డీజీపీ..

|

Jul 22, 2024 | 7:40 PM

మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమలరావు. ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో.. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాల సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్‌ ఆరా తీస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో.. విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.

ఏపీలో ఫైళ్ల దగ్ధం ఘటనలపై దుమారం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. రంగంలోకి డీజీపీ..
Ap Dgp
Follow us on

మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమలరావు. ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో.. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాల సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్‌ ఆరా తీస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో.. విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్‌ అనే ఉద్యోగి కార్యాలయంలో నిన్న రాత్రి 11 గంటల వరకు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లికు చేరుకొని సబ్‌కలెక్టర్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. డీజీపీతోపాటు సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రతి అణువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదం కేవలం కీలక రికార్డులు ఉన్న విభాగాల్లో మాత్రమే దగ్ధం కావడం, మిగిలిన విభాగాలు కాలకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు..రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఫైళ్లు దగ్దమైన వ్యవహారంపై.. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ముందుకు సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్లు, కీలక ఫైళ్ల దహనానికి కారణమైన ఉద్యోగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇక ఇలాంటి ఫైళ్లు దగ్ధం చేసిన ఘటనే విజయవాడలో కూడా గతంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున మైనింగ్ శాఖకు చెందిన కీలక ఫైళ్లను కారులో నిర్మానుష్యప్రాంతానికి తీసుకువచ్చి కాల్చేశారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టింది పోలీసుశాఖ. అప్పటి ఘటనలో లెటర్ హెడ్లు, ప్రభుత్వానికి చెందిన కీలక డాక్యూమెంట్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని విలువైన హార్డ్ డిస్ట్కులను కూడా బయటకు తీశారు. ఆ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే మరో ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అయితే ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశంతో రంగంలోకి డీజీపీ దిగడంతో దర్యాప్తులో వేగం పుంజుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..