Gas Cylinders: తిన్నింటి వాసాలు లెక్కెట్టిన డెలివరీ బాయ్స్.. గ్యాస్ సిలిండర్లు మాయం చేసి గోదాముకే నిప్పు పెట్టిన ఘనులు..

|

Apr 19, 2022 | 7:27 PM

సుదీర్ఘ కాలంగా గ్యాస్ సిలిండర్ల గోడౌన్లో డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నారు. నెలనెలా వచ్చే జీతంతో జీవితం కొనసాగిస్తున్నారు. రానురాను గ్యాస్ సిలిండర్ల(Gas Cylinders) ధరలు పెరుగుతూ వచ్చాయి‌..

Gas Cylinders: తిన్నింటి వాసాలు లెక్కెట్టిన డెలివరీ బాయ్స్.. గ్యాస్ సిలిండర్లు మాయం చేసి గోదాముకే నిప్పు పెట్టిన ఘనులు..
Cylinder Theft
Follow us on

సుదీర్ఘ కాలంగా గ్యాస్ సిలిండర్ల గోడౌన్లో డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నారు. నెలనెలా వచ్చే జీతంతో జీవితం కొనసాగిస్తున్నారు. రానురాను గ్యాస్ సిలిండర్ల(Gas Cylinders) ధరలు పెరుగుతూ వచ్చాయి‌. ఒక్కో సిలిండర్ వెయ్యి రూపాయలకు చేరింది. దీంతో డెలివరీ బాయ్స్‌లో దుర్బుద్ధి పుట్టింది. ఏకంగా డెబ్బై సిలిండర్లను అమ్మేశారు‌. చేసిన తప్పు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ చివరికి పోలీసుల(Police)కు చిక్కారు. గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో బాపూజీ గ్యాస్ గోడౌన్ ఉంది. ఇందులోని 70 సిలిండర్లను సూపర్ వైజర్ వెంకటేష్ సాయంతో డెలివరి బాయ్స్ అమ్మేశారు. అయితే అనుమానం రాకుండా ఉండేందుకు ఖాళీ సిలిండర్లలకు సీల్ వేసి భద్ర పరిచారు. అయితే 70 సిలెండర్ల లెక్క తేలకపోవటంతో మేనేజర్ వీరేంద్ర నిలదీశాడు.

ఈ విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో ఈనెల 15న రాత్రి సమయంలో ఖాళీ సిలిండర్లపై పెట్రోల్ నిప్పు అంటించారు. పెను ప్రమాదం జరిగేలోపే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే డెలివరీ బాయ్స్‌పై అనుమానం ఉన్న మేనేజర్ వీరేంద్ర పోలీసులకు ఫిర్యాదు‌‌ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టును విప్పారు. ఐదుగురిని అరెస్టు చేసి 1,27,200 రూపాయలను రికవరీ చేశారు. అయితే వారు చేసిన పనికి పెద్ద ప్రమాదమే జరిగేది. ఖాళీ సిలిండర్లతో పాటు ఫుల్‌ సిలిండర్లకు మంట అంటుకుంటే గోడౌన్‌ ఉన్న పరిసరా ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించేది.

Read also.. Pawan Kalyan: అప్పుల ఊబిలో ఉన్న రైతులను ప్రభుత్వమే రక్షించాలి.. అన్నదాతకు ఇచ్చిన హామీ ఏమైందన్న జనసేనాని