Ap News: ఏపీ రాష్ట్రంలో తగ్గుతున్న పిల్లల సంఖ్య.. ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్న జంటలు

|

May 13, 2022 | 12:02 PM

Ap News: నలభై, యాభై ఏళ్ల కాలంలో ఒకరిద్దరి సంతానంతో కాకుండా ఐదారుగురు సంతానం ఉండేవారు. మారుతున్న కాలానుగుణంగా సంతానం తగ్గిపోయింది. ఇక రెండు..

Ap News: ఏపీ రాష్ట్రంలో తగ్గుతున్న పిల్లల సంఖ్య.. ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్న జంటలు
Representative Image
Follow us on

Ap News: నలభై, యాభై ఏళ్ల కాలంలో ఒకరిద్దరి సంతానంతో కాకుండా ఐదారుగురు సంతానం ఉండేవారు. మారుతున్న కాలానుగుణంగా సంతానం తగ్గిపోయింది. ఇక రెండు,మూడు దశాబ్దాల క్రితం అది ఇద్దరు, ముగ్గురు సంతానం చాలానే భావన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అది మరింతగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక్కరే చాలనే భావన వచ్చేస్తోంది. దీంతో కుటుంబంలో పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఏపీ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. సగటున రాష్ట్రంలోని ప్రతి 10 కుటుంబాలకు పిల్లలు 17 మందే ఉంటున్నారు. ఈ సంఖ్య మరింతగా తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) చివరి రౌండ్‌ వివరాల ప్రకారం.. సంతానోత్పత్తి రేటు 2.0గా ఉండగా, 2015-16లో ఇది 2.2గా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.7గా రికార్డు అయ్యింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 1992-1993 లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2.59గా ఉండేది. ఇప్పుడున్న కాలంలో ఖర్చులు పెరిగిపోయాయి. అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో పిల్లలను పెంచడం కుటుంబాలకు భారంగా మారుతోంది. ఈ కారణంతో కూడా ఒకరితోనే సరిపెట్టుకుటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇద్దరు పిల్లలను కంటున్న జంటలు.. ఇప్పుడు ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలు అమలు చేస్తోంది. సంతానం తగ్గించుకునే కుటుంబాలకు ప్రోత్సహకాలు ప్రకటించింది. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించింది. 1992 నుంచి 1999 వరకు విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీనివల్ల సంతానం సంఖ్య క్రమంగా తగ్గింది. అయితే జనాభా పరిమితి ఇంతకుమించి తగ్గకుండా చూడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. దీని కారణంగా యువత సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కుటుంబ నియంత్రణ కారణంగా 35 నుంచి 40 సంవత్సరాల వయసువారు తగ్గుతూ వస్తున్నారు. ఈ వయసువారు తగ్గడంతో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 ప్రకారం.. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణను 94 మంది మహిళలు పాటిస్తున్నారు.

ఈ కేటగిరిలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, సిక్కిం, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. పురుషుల్లో అయితే 2 నుంచి 5 శాతం మంది మాత్రమే కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు 7 రాష్ట్రాల్లో 90 శాతం మంది పిల్లలు ఆస్పత్రుల్లో జన్మిస్తున్నారు. కేరళలో ఇది వంద శాతం ఉంది. అతి తక్కువగా అంటే నాగలాండ్‌. ఇక్కడ 46 శాతమే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి