Andhra Pradesh: దసరా పండుగ వేళ భలే న్యూస్.. మట్టానికి పడిపోయిన టమాట ధర

కిలో టమాట నూరు రూపాయలంటే ఎట్ల కొనాలే? అదీ పండుగ వేళ ఈ రేట్లు ఏంది అని సామాన్యులు తెగ మనాది పడ్డారు. అయితే దసరా పండుగ వేళ టమాట రేట్లు అమాంతం పడిపోయాయి. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Andhra Pradesh: దసరా పండుగ వేళ భలే న్యూస్.. మట్టానికి పడిపోయిన టమాట ధర
Tomato
Follow us

|

Updated on: Oct 12, 2024 | 10:58 AM

దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్. టమాట ధర ఒక్కసారిగా కుప్పకూలింది. మూడు రోజుల క్రితం వరకు కిలో 100 రూపాయలు పలికిన టమాట ప్రస్తుతం 20 రూపాయలకు పడిపోయింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో ధర ఈ విధంగా ఉంది. ఈ జిల్లాలో 20 వేల హెక్టార్లకు పైగా టమాట సాగు జరుగుతుంది. పత్తికుంట, ఆదోని, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో టమాటాను ఎక్కువగా పండిస్తారు. తాజాగా ఉభయ రాష్ట్రాల్లోని రిటైల్ టమోటా ధరలు విపరీతంగా తగ్గాయి. దసరా పండుగ రోజు టమాట ధరలు తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల టమాట సెంచరీ కొట్టడంతో.. రాజమండ్రిలోని రైతుబజార్లలో రాయితీకి టమాటాలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.  మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఒక్కో రైతుబజారుకు 20 నుంచి 40 ట్రేలను సరఫరా చేసింది.  కేజీ రూ.58గా ధర నిర్ణయించి అమ్మించారు అధికారులు.

అయితే పెరిగిన ధరలు వారం కూడా నిలకడగా ఉండకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో టమాటా పంట పూర్తిగా దెబ్బతిందని.. ఇప్పుడు పెరిగిన ధరలు కూడా పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..