
ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. అర్నబ్, మురసు తుఫాన్‌ల నుంచి తేరుకోక ముందే దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాన్ తిష్ఠవేసింది. ప్రస్తుతానికి చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 660 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాన్ రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఇక శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇక ఈ తపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గురు,శక్రవారాల్లో కోస్తా తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి, రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో తెలిపారు.
ఇక అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. భారీ వర్షాలు, బలమైన గాలుల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ అంతరాయాలు, అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ సర్కిల్ కంట్రోల్ రూం: 9440817561
జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు