
నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడన ప్రాంతం.. నవంబర్ 14న ఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది వాయవ్య దిశగా పయనించి రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ, నవంబర్ 16 సాయంత్రం సమయానికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ విడుదల చేసింది.
కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు ,రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతవరణశాఖ స్పష్టం చేసింది. అలాగే రాయలసీమలో ఈరోజు ,రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ క్రమంలో సముద్రంలో అలలు ఎగిసిపడే అవకాశమున్న క్రమంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఏపీలో ఇప్పటివకే అర్నబ్, మురసు తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. అలాగే రోడ్లు, విద్యుత్ స్తంభాలు బాగా దెబ్బతిన్నాయి. అలాగే పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా కట్ అయింది. దీంతో అధికారులు వీటిని పునురుద్దరించారు. ఇప్పుడు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉండగా.. ఇది మచిలీపట్నం, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేశారు. తీరం దాటే సమయంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బలమైన ఈదురుగాలులు, వర్షాలు పడే అకాశముంది.
ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వస్తున్న తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఏపీలో వరుస తుఫాన్లలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఈ తుఫాన్‌కు అక్వాన్ అనే నామకరణం చేశారు. ఇరాన్ ఈ పేరును సూచించింది. ఈ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై వాతావరణశాఖ ఎప్పటికప్పుడు నివేదికలు విడుదల చేస్తోంది.