Weather Report: తీరం వైపుగా తుఫాన్.. రాబోయే 3 రోజుల వాతావరణంపై లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌..

తెలుగురాష్ట్రాలకు వాతవరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుఫాన్ మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Weather Report: తీరం వైపుగా తుఫాన్.. రాబోయే 3 రోజుల వాతావరణంపై లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌..
Cyclone Alert For Ap And Telangana

Updated on: Oct 24, 2026 | 6:18 PM

తూర్పు మధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం, దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 25న మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26 ఉదయం నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఇది మరింత బలపడి అక్టోబర్ 28, 2026 ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణం:

వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలోని పలు జిల్లాల్లో తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది. ఆది, సోమవారాల్లోనూ ఈ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమలో వాతావరణం

ఇక రాయలసీమలో శనివరాం తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారే క్రమంలో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని.. వీటి ప్రభావంతో ఆటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. సోమవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us