CPI Narayana: ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత రాజకీయాల్లో పెనుమార్పులు.. కీలక వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ..

|

Apr 04, 2021 | 4:18 PM

CPI Narayana: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలపై సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని..

CPI Narayana: ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత రాజకీయాల్లో పెనుమార్పులు.. కీలక వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ..
CPI Narayana
Follow us on

CPI Narayana: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలపై సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని కార్పోరేట్ రంగాలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు వ్యతిరేక చట్టాలతో రైతులను ముంచేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అదానీ కంపెనీలు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున గోడౌన్లు నిర్మిస్తున్నాయని అన్నారు. ఆదానీ, అంబానీ, ఫోస్కో కంపెనీలకు దేశాన్ని దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఎన్ఐఏ సంస్థలను ప్రయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారందరినీ కేంద్రం టార్గెట్ చేస్తోందన్నారు. సీఎం జగన్ కూడా మోదీ వర్గంలోని వారేనని నారాయణ విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని నారాయణ పిలుపునిచ్చారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత దేశంలో రాజీకీయంగా పెను మార్పులు ఏర్పడుతాయని నారాయణ జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం మోదీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ వేశం వేశారని విమర్శించారు. ఎన్నికలు పూర్తవగానే వేషం మార్చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతా పశ్చిమ బెంగాల్‌లోనే మకాం వేసిందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ వస్తే పాండిచ్చేరిని అమ్మేస్తారని, అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్‌ను గెలిపించాలని అక్కడి ప్రజలకు నారాయణ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో వైసీపీ, టీడీపీపైనా నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంటే జగన్, చంద్రబాబులు ఎందుకు మాట్లాడటం లేదని నారాయణ ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం అంటే టీడీపీది దివాళాకోరుతనమే ఎద్దేవా చేశారు. ఎన్నికల బహిష్కరణ అంటే టీడీపీ పారిపోయిందని భావించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రాజకీయాలలో సమంజసం కాదన్నారు.

Also read:

Perni nani on Pawan : పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారు.. తిరుపతి ప్రచారంపై వైసీపీ మంత్రుల ముప్పేటదాడి

Realme X7 Pro: హై ఎండ్‌ ఫీచర్లతో రియల్‌మి X7 ప్రో ఎక్స్‌ట్రీమ్.. ఊహించని రీతిలో రెస్పాన్స్.. ( వీడియో )