Andhra Pradesh: ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో వీడియోలో చూడండి..

ప్రమాదవశాత్తు జంతువులు, పాములు ఎక్కడైనా ఇరుక్కుపోవడం మనం తరచూ చూస్తుంటాం. కానీ కోపంతో తానే స్వయంగా పడగ విప్పి ఓ ఇరుకైన కన్నంలో చిక్కుకుపోయిన వింత ఘటన విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపింది. తోక పట్టుకుని బయటకు లాగుతున్న కొద్దీ లోపల నుంచి తీవ్రమైన బుసలు.. మరోవైపు గంటపాటు స్థానికులను ముచ్చెమటలు పట్టించిన ఆ నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra Pradesh: ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో వీడియోలో చూడండి..
Cobra Gets Stuck In Drain Hole In Visakhapatnam

Edited By:

Updated on: Sep 05, 2026 | 10:07 AM

సాధారణంగా ప్రమాదాల్లో ఇరుక్కుపోయిన ఎన్నో మూగజీవులను చూస్తుంటాం. కానీ కోపంతో తానే పడగవిప్పి స్వయంగా ఓ కన్నంలో ఇరుక్కుపోయిన విచిత్రమైన ఘటన విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులను భయాందోళనలకు గురిచేసిన ఈ నాగుపాము రెస్క్యూ ఆపరేషన్ దాదాపు గంటపాటు ఉత్కంఠభరితంగా సాగింది. విశాఖలోని గాజువాక సుందరయ్య కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాలనీ పరిసరాల్లో భారీ నాగుపాము సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకునే సరికే, ఆ నాగుపాము మురుగు కాలువ పక్కనే ఉన్న చిన్న కన్నంలోకి వేగంగా దూరిపోయింది. కేవలం దాని తోక భాగం మాత్రమే బయటకు కనిపిస్తుంది.

వెంటనే అప్రమత్తమైన కిరణ్.. పాము తోక భాగాన్ని చేతితో పట్టుకుని నిదానంగా పైకి లాగే ప్రయత్నం చేశారు. ఎంత శ్రమించినా పాము బయటకు రాకపోగా, లోపలి నుంచి తీవ్రమైన బుసల శబ్దాలు వినిపించడంతో చుట్టూ చేరిన జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. లోపల ఏం జరిగిందని పరిశీలించగా విస్తుపోయే విషయం వెలుగుచూసింది. బయటకు లాగుతున్నారన్న ఆగ్రహంతో ఆ నాగుపాము కన్నం లోపలే పూర్తిస్థాయిలో పడగ విప్పింది. పడగ వెడల్పుగా మారడంతో అది ఆ ఇరుకైన రంధ్రంలో గట్టిగా ఇరుక్కుపోయింది.

దీంతో బలవంతంగా లాగితే పాముకు గాయమయ్యే ప్రమాదం ఉండటంతో కిరణ్ అత్యంత చాకచక్యంగా, ఓపిగ్గా వ్యవహరించారు. దాదాపు గంటపాటు శ్రమించి, ఎలాంటి హాని తలపెట్టకుండా ఆ నాగుపామును రంధ్రం నుంచి సురక్షితంగా బయటకు లాగారు. క్షేమంగా పామును బంధించి సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us