Andhra Pradesh: మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి జగన్.. నేడు అధికారులతో సమీక్ష..

|

Jan 22, 2021 | 10:32 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

Andhra Pradesh: మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి జగన్.. నేడు అధికారులతో సమీక్ష..
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న రేషన్ సరులకు నేరుగా లబ్ధిదారుల ఇంటికే చేర్చే పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. తాజాగా మరో పథకానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఇంటర్నెట్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలించారు.

అనుకున్నదే తడవుగా, దానికి సంబంధించి కార్యరంగంలోకి దిగారు. ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే అంశంపై ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి పల్లెలో.. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు ఎలాంటి చర్యలుు తీసుకోవాలనే అంశంపై అధికారులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం.

Also read:

Priyanka Arul: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ బ్యూటీ… బడా హీరోతో నటించే అవకాశం..

Superstar Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ కోసం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న న్యూ లుక్ ఫోటోలు.