Priyanka Arul: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ బ్యూటీ… బడా హీరోతో నటించే అవకాశం..

Priyanka Arul To Star In surya Movie: మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి ప్రియాంకా అరుళ్‌ మోహన్‌. ఈ పేరు పెద్దగా అందరికీ తెలియకపోయినప్పటికీ నాని హీరోగా నటించిన 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమాలో హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే..

Priyanka Arul: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన 'గ్యాంగ్‌ లీడర్‌' బ్యూటీ... బడా హీరోతో నటించే అవకాశం..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 10:27 AM

Priyanka Arul To Star In surya Movie: మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి ప్రియాంకా అరుళ్‌ మోహన్‌. ఈ పేరు పెద్దగా అందరికీ తెలియకపోయినప్పటికీ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిందీ బ్యూటీ. తన క్యూట్‌ నటన, అంతే క్యూట్‌ అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీకారం’సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిన్నది మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ సూర్య హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అరుళ్‌ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుందన్నమాట. ఇదిలా ఉంటే గతంలో ఈ సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే కారణాలు తెలియకపోయినప్పటికీ ఎందుకో చివరి క్షణంలో రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఈ ఆఫర్‌ ప్రియాంకాను వరించిందని సమాచారం. మరి ఈ సినిమా ప్రియాంకా కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Also Read: Mahesh Wishes Namrata:అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్ : మహేష్ బాబు