అంబులెన్స్‌ మాఫియాకు సర్కార్‌ చెక్‌.. ఫిక్స్‌డ్‌ ఛార్జీలు నిర్ణయించిన కలెక్టర్‌..

|

Apr 28, 2022 | 9:23 AM

అంబులెన్స్‌ మాఫియాపై(Ambulance mafia) ప్రభుత్వం స్పందించింది. అంబులెన్స్‌లకు చార్జీలను(ambulance fare) ఫిక్స్‌ చేస్తూ ప్రత్యేక ఆర్డర్స్‌ ఇచ్చింది. ఆసుపత్రుల్లో మాఫియాగా ..

అంబులెన్స్‌ మాఫియాకు సర్కార్‌ చెక్‌.. ఫిక్స్‌డ్‌ ఛార్జీలు నిర్ణయించిన కలెక్టర్‌..
Ambulance
Follow us on

అంబులెన్స్‌ మాఫియాపై(Ambulance mafia) ప్రభుత్వం స్పందించింది. అంబులెన్స్‌లకు చార్జీలను(ambulance fare) ఫిక్స్‌ చేస్తూ ప్రత్యేక ఆర్డర్స్‌ ఇచ్చింది. ఆసుపత్రుల్లో మాఫియాగా మారిన అంబులెన్స్ దందా కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అంబులెన్స్ దందా పై నిన్న జిల్లా కలెక్టర్‌తో సమావేశమైయ్యారు ఆర్డీఓ, డీఎంహెచ్ ఓ, ఆర్టీఓలు. ఈ సమావేశం తర్వాత తాయరు చేసిన రిపోర్ట్‌ను కలెక్టర్‌కు సమర్పించారు. చార్జీలవసూలు, నిర్వహణపై వచ్చిన ఫిర్యాదులపై అంబులెన్స్ డ్రైవర్లు, ఆపరేటర్లతో సమావేశమై తీసుకున్న నిర్ణయాలను కలెక్టర్ కు వివరించారు అధికారులు.

అంబులెన్స్ చార్జీలను అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నిర్దేశించిన రేట్ల అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యారు. మూడు కేటగిరీల్లో అంబులెన్స్ చార్జీలను విభజించిన అధికారులు.. ఎక్కడైనా ఒకే విధంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అంబులెన్సు నిర్వాహకులు వసూలు చేయాల్సిన చార్జీల వివరాలను ధరల పట్టిక లను ఆస్పత్రుల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈఎంటీ బితో ఉన్న.. బేసిక్ లైఫ్ సపోర్ట్, పెసెంట్ ట్రాన్స్ పోర్ట్ అంబులెన్స్‌లు కిలో మీటర్ కు ఎంత మేర చార్జీలు వసూలు చేయాలన్న దానిపై బోర్డులు ఏర్పాటు చేయనున్న అధికారులు.

ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!