YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. అన్నీ చెప్పేశానన్న ఎంపీ..

|

Jan 28, 2023 | 9:10 PM

వైయస్ వివేకానంద రెడ్డి హత్య విచారణలో ఈ రోజు కీలక ఘట్టం నమోదయ్యింది. ఎంపీ అవినాష్ రెడ్డిని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించింది సీబీఐ.

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. అన్నీ చెప్పేశానన్న ఎంపీ..
Ys Avinash Reddy
Follow us on

వైయస్ వివేకానంద రెడ్డి హత్య విచారణలో ఈ రోజు కీలక ఘట్టం నమోదయ్యింది. ఎంపీ అవినాష్ రెడ్డిని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించింది సీబీఐ. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో నలుగురు ఆఫీసర్లతో కూడిన బృందం ఈ విచారణ చేసింది. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చాననీ.. అవసరమైతే ఇంకో సారి కూడా రావల్సి ఉంటుందని సీబీఐ ఆఫీసర్స్ తనతో అన్నారనీ.. తాను వారికి సహకరిస్తానని అన్నారాయన.

ఇదిలా ఉంటే.. తాను లాయర్‌ను వెంటరమ్మనడం వెనక ఒక కారణముందన్నారు అవినాష్. తన వ్యక్తిత్వ హననం జరిగేలా.. వాస్తవాలను వక్రీకరిస్తూ.. కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారనీ.. అందుకే వీడియో, ఆడియో ఎవిడెన్సులతో పాటు లాయర్ ప్రెజెన్స్ సైతం కోరారని చెప్పారు. అయితే సీబీఐ ఐవో ఇందుకు అనుమతించలేదని అన్నారు అవినాష్.

తన డిమాండ్లు సీబీఐ ఒప్పుకోకున్నా.. పూర్తి సహకారమందించానని తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాననీ. మరోమారు రమ్మన్నా వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదనీ అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..